లాక్ డౌన్ సమయంలో నాచురల్ స్టార్ నాని 'వి' మూవీ తో ఓటిటి ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇంద్రగంటి మోహన్ కృష్ణ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ మూవీ లో సుధీర్ బాబు మరో హీరోగా నటించాడు. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ మూవీ ఆ అంచనాలను అందుకోవడం లో విఫలమైంది. ఈ క్రమంలో ప్రస్తుతం చేస్తున్న సినిమాల ఫై ఇంకాస్త ఫోకస్ పెట్టాడు. ప్రస్తుతం నాని శివ నిర్వాణ డైరెక్షన్లో టక్ జగదీష్ , టాక్సీవాలా డైరక్టర్ రాహుల్ దర్శకత్వంలో ‘శ్యామ్ సింగ రాయ్’, వివేక్ ఆత్రేయ డైరెక్షన్లో అంటే సుందరానికి మూవీస్ చేస్తున్నాడు.

వీటిలో ముందుగా టక్ జగదీష్ మూవీ ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఏప్రిల్ 23 న ఈ మూవీని రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. గతంలో శివ - నాని కలయికలో నిన్ను కోరి వచ్చి సూపర్ హిట్ సాధించడం తో ఈ మూవీ ఫై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఆ అంచనాలకు ఏమాత్రం తీసిపోని రీతిలో సినిమా ఉందని సినిమా తాలూకా అప్డేట్స్ చెప్పకనే చెపుతున్నాయి. ఇప్పటికే ఫస్ట్ లుక్ ఆకట్టుకోగా..రేపు (ఫిబ్రవరి 24 ) నాని పుట్టిన రోజు సందర్బంగా మేకర్స్ టక్ జగదీష్ టీజర్ ను ఓ రోజు ముందే రిలీజ్ చేసి అభిమానులను ఆకట్టుకున్నారు.

టీజర్ మొత్తం ఎలాంటి డైలాగ్స్ లేకుండా కేవలం నేపధ్య సంగీతం తో సినిమా ఎలా ఉందొ చెప్పిన తీరు ఆకట్టుకుంది. థమన్ సంగీతం మరోసారి ఆకట్టుకుంది. పక్క ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ మూవీ..నానికి మంచి విజయాన్ని అందించడం ఖాయంగా టీజర్ చూస్తే చెప్పవచ్చు. ఈ సినిమాలో రీతు వ‌ర్మ, ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. జగపతి బాబు, రావు రమేష్, నరేష్, నాజర్, దేవదర్శిని, రోహిణి, మాల పార్వతి, డేనియల్ బాలాజి, తిరువీర్, ప్రవీణ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: