అంతకు ముందు.. ఆ తరువాత మూవీ తో తెలుగు ఇండస్ట్రీ కి పరిచమైన బ్యూటీ ఈషా రెబ్బ. ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ లో ఈషా హీరోయిన్ గా నటించి మంచి మార్కులు కొట్టేసింది. ఆ తర్వాత బందిపోటు , అమితుమీ , బ్రాండ్ బాబు వంటి సినిమాల్లో నటించినప్పటికీ అవేవి పెద్దగా విజయాలు సాదించకపోయేసరికి ఛాన్సులు తక్కువయ్యాయి. మొదటి నుండి కూడా అందాల ఆరబోతకు కాస్త దూరంగా ఉండడం తో నిర్మాతలు ఈమెను చూసి చూడనట్లు వదిలేసారు.

ఈ తరుణంలోనే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్లో తెరకెక్కిన అరవింద సమేత మూవీ లో సెకండ్ హీరోయిన్ గా ఛాన్స్ వచ్చింది. ఈ సినిమా పెద్ద విజయం సాధించడం తో ఈషా జాతకం మారినట్లే అని అనుకున్నారు. కానీ సినిమా విజయం సాధించినప్పటికీ అమ్మడికి మాత్రం అవకాశాలు దక్కలేదు. ఈ తరుణంలో తనలోని మరో యాంగిల్ ను బయటకు తీసింది. ప్రస్తుతం ఛాన్సులు తక్కువైనా బ్యూటీస్ అంత కూడా సోషల్ మీడియా ను గట్టిగా నమ్ముకొని , అందాల ఆరబోత తో సెగలు పుట్టిస్తూ ఛాన్సులు దక్కించుకుంటున్నారు.

ఇప్పుడు ఈషా కూడా ఇదే బాటలో నడుస్తుంది. ఎప్పటికప్పుడు తనలోని హాట్ యాంగిల్ ను బయటకు తీస్తూ వైరల్ గా మారుతుంది. తాజాగా బాత్ టబ్ లో సెక్సీ పోజ్ తో వేడి పుట్టించింది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. ఈ పిక్స్ చూసిన నెటిజన్లు , ఫాలోయర్స్ ఈ దెబ్బ తో అమ్మడికి అవకాశాలు రావడం ఖాయం అని కామెంట్స్ వేస్తున్నారు.                                              

మరింత సమాచారం తెలుసుకోండి: