సాధారణంగా సినిమా స్టార్ట్ అవ్వగానే హీరో ఎంట్రీ తప్పకుండా ఉండాలి. అప్పుడే ప్రేక్షకులకు, అభిమానులకు ఎక్కడలేని ఊపు వచ్చేస్తుంది. కానీ అలా కాకుండా సినిమా స్టార్ట్ అయిన అరగంటకో, గంటకో హీరో ఎంట్రీ ఇస్తే, అది మాత్రం అభిమానులతో పాటు చూసే ప్రేక్షకులకు కూడా విసుగు పుడుతుంది. కానీ హీరో అరగంటకు ఎంట్రీ ఇచ్చినా, ఆ సినిమాలో బాగా దమ్ము ఉండడంతో ఆ సినిమాలు బాగా సూపర్ హిట్ సాధించాయి. అయితే ఆ సినిమాలు ఏంటో ఇప్పుడు ఇక్కడ చూద్దాం


 క్షణం క్షణం :
విక్టరీ వెంకటేష్ సినీ కెరీర్లో బెస్ట్ ఫిలిం గా నిలిచిన చిత్రం క్షణం క్షణం. ఈ సినిమాను రాంగోపాల్ వర్మ డైరెక్ట్ చేశాడు. ఈ సినిమాలో వెంకటేశ్ ను దాదాపు సినిమా స్టార్ట్ అయిన అరగంట తర్వాత  ఇంట్రడ్యూస్ చేసి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశాడు. ఈ చిత్రంలో శ్రీదేవి నటించిన తీరు అందరినీ మెప్పించింది. ఈ సినిమాలో హీరో ఎంట్రీ లేటుగా ఉన్నప్పటికీ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బాస్టర్ గా నిలిచింది.


మగాడు :
రాజశేఖర్,జీవిత సంయుక్తంగా కలిసి నటించిన చిత్రం మగాడు. ఈ సినిమాలో హీరో ఇంటర్వెల్ కు కాస్త ముందు సీన్ లోకి తీసుకొచ్చారు డైరెక్టర్.  ఫస్ట్ హాఫ్ అంతా మినిస్టర్ కిడ్నాప్ తో నడిచిన స్టోరీ, ఆ తర్వాత రాజశేఖర్ ఎంట్రీతో స్పీడ్ పెంచుకుంటుంది. ఇక ఈ సినిమా షూటింగ్ లోనే రాజశేఖర్ మేడ మీద నుండి కింద దూకే క్రమంలో కింద పడి గాయాలపాలు కూడా అయ్యాడు.


 కెప్టెన్ ప్రభాకర్ :
తమిళ దర్శకుడు అయిన  సెల్వమణి ని స్టార్ డైరెక్టర్ గా చేసింది ఈ సినిమానే. ఈ డైరెక్టర్ ఎవరో కాదు మన స్టార్ హీరోయిన్ రోజా భర్త. ఈ సినిమాలో హీరో విజయ్ కాంత్ సినిమా మొదలైన అరగంట తర్వాత సీన్ లోకి వస్తాడు. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బాస్టర్ గా నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: