150 పైగా సినిమాలకు దర్శకత్వం వహించి ఇండస్ట్రీని ఒక విధంగా శాసించిన దాసరి నారాయణరావు కేవలం దర్శకుడు మాత్రమే కాకుండా రచయిత కూడ. కేవలం సినిమాలకు సంబంధించిన కథలు సంభాషణలు మాత్రమే కాదు సినిమాలలోని పాటలను కూడ దాసరి వ్రాసే వారు. అప్పట్లో దాసరి వ్రాసిన పాటలు సూపర్ హిట్ అయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.


అలాంటి పాటలలో కృష్ణంరాజు నటించిన ‘సీతారాములు’ మూవీలోని ‘తొలిసంజ వేళలో తొలిపొద్దు పొడుపులో’ పాట ఆరోజులలో సూపర్ హిట్. కన్యాకుమారి ప్రాంతంలో చిత్రీకరించిన ఆపాట ఆ సినిమాకు హైలెట్. అయితే ఆపాట పై అప్పట్లో ఒక కాపీ వివాదం నడిచింది. ఈ పాటను దేవులపల్లి కృష్ణశాస్త్రి ఈసినిమా కోసం వ్రాసారని ఈపాట వ్రాసిన తరువాత ఆయన చనిపోవడంతో ఆ పాటను తానే వ్రాసినట్లుగా దాసరి ఈ మూవీ టైటిల్ కార్డులో వేసుకున్నారని అంటూ అప్పట్లో పెద్ద వివాదమే నడిచింది.


ఈ విషయాన్ని ఆసరాగా తీసుకుని అప్పట్లో చాలామంది దాసరి వ్యతిరేకులు దాసరి పై నెగిటివ్ ప్రచారం చేసారు. అయితే ఈ విషయం పై దాసరి అప్పట్లో స్పందించక పోవడంతో కొందరు సందేహాలు కూడ వ్యక్త పరిచారు. అయితే అసలు విషయం వేరు అంటూ ఒక ప్రముఖ దినపత్రిక ఆ విషయం పై ఒక ఆసక్తికర కథనం ప్రచురించింది. వాస్తవానికి ఈ సినిమాకు సంబంధించి దేవులపల్లి వ్రాసిన పాట ‘కలలోచ్చే వేళ ఇది’ అనే పల్లవితో ఒక పాట ఉందట.


అయితే ఆ పాటను దాసరి ఆసినిమాలో ఉపయోగించకుండా తానే స్వయంగా ‘తొలిసంజ వేళలో’ పాటను వ్రాశారట. అసలు విషయం తెలియక దాసరినారాయణరావు దేవులపల్లి కృష్ణశాస్త్రి పాటను కాపీ కొట్టారు అంటూ అప్పట్లో నెగిటివ్ ప్రచారం జరిగిందట. ఈ కాపీ వ్యవహారం అప్పట్లో హాట్ టాపిక్ గా మారడంతో ఈ పాట వ్రాసింది ఎవరు అంటూ అప్పట్లో అనేక చర్చలు కూడ జరిగాయట..

మరింత సమాచారం తెలుసుకోండి: