టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోల్లో రామచరణ్, జూనియర్ ఎన్టీఆర్ లు కూడా ఉన్నారు. ఎవరి తగ్గా ఫ్యాన్స్ వాళ్ళకి ఉన్నారు. నటనలోనూ, అభినయంలోనూ, హవా భావాలు వ్యక్తం చేయడంలోనూ, డాన్సులోను ఇద్దరు ఇద్దరే. ఈ ఇద్దరి హీరోలను అభిమానులు తమ గుండెల్లో పెట్టుకుని మరి పూజిస్తూ ఉంటారు. వీళ్ళద్దరు కాంబినేషన్లో వచ్చే ట్రిపుల్ఆర్ సినిమా కోసం అభిమానులు ఎంత ఆసక్తిగా  ఎదురుచూస్తారో మాటల్లో చెప్పలేము. ఇప్పుడు రామ్ అండ్ భీమ్ అనే బిగ్  ఫైట్  అభిమానుల్లో నడుస్తుంది.మా హీరో లుక్స్ సూపర్ అని ఒకరు అంటే, మా హీరో డైలాగ్ సూపర్ అని మరొకరు అంటున్నారు. అయితే ఈ యుద్ధం అనేది కేవలం  మూవీలోపల మాత్రమే కాదు అనే విషయం కూడా అర్ధం అవుతుంది.


 ఎందుకంటే ఆర్.ఆర్.ఆర్  సినిమా తర్వాత వేరే ఈ సినిమాలో నటించ బోతున్నారు, దర్శకుడు ఎవరు?  ఏంటి అనే ఆలోచనలో పడ్డారు అభిమానులు. అలాగే అభిమానుల అంచనాలను మించి ఎవరికీ వారు పోటా పోటీగా తరవాత చేయబోయే సినిమాలను  అనౌన్స్ చేసేస్తున్నారు. ఈ క్రమములో  ఇద్దరు హీరోల మధ్య పోటా పోటీ నడుస్తుందని అభిమానులు భావిస్తున్నారు.
రాజమౌళి సినిమా తర్వాత రామ్ చరణ్‌ ఎవరితో సినిమా  చేస్తున్నారు అనే.విషయంపై మొన్నటిదాకా ఎవరికీ క్లారిటీ లేదు. కానీ రీసెంట్ గా రామ్ చరణ్  కోలీవుడ్‌ స్టార్ డైరెక్టర్ శంకర్‌తో సినిమా అనౌన్స్ చేసి అభిమానుల్లో కొత్త  ఉత్సహన్ని నింపాడు. మరి మన యంగ్ టైగర్ మేటరేంటి. అని అభిమానుల్లో ఆసక్తి రేగింది. ఇప్పటికే తారక్, మాటల మాంత్రికుడు  త్రివిక్రమ్‌తో కలిసి  తారక్30 సినిమా ఎప్పుడో అనౌన్స్ అయింది.


మళ్ళీ ఇప్పుడు ఎన్టీఆర్ యొక్క ఫ్యూచర్ ప్లాన్ మరేమన్న ఉందా అన్నా అనుమానం అందరిలో మెదులుతుంది. సినీ వర్గాల అభిప్రాయం ప్రకారం ఎన్టీఆర్ తన రూట్ మార్చుకున్నాడు అనే చెప్పాలి. ఈసారి ఎన్టీఆర్ కన్ను  హాలీవుడ్ పై పడిందట. నా నెక్ట్స్ స్టెప్ హాలీవుడ్ లో అంటున్నారు మన యంగ్ టైగర్. ప్రముఖ  హాలీవుడ్‌ డైరక్టర్‌ నైట్‌ శ్యామలన్ లేటెస్ట్‌గా ఎన్టీఆర్‌ కి ఒక  బెస్ట్ స్టోరీ వినిపించారట.  ఆఫ్టర్‌ ఎర్త్, అన్‌ బ్రేకబుల్‌ వంటి సూపర్‌ నేచురల్‌ మూవీస్‌తో ఆకట్టుకున్న శ్యామలన్‌.. ట్రిపులార్‌లో కొమరం భీమ్‌గా ఎన్టీఆర్‌ ఫిజిక్ చూసి మైమరిచిపోయాడట. తాను చేయబోయే తర్వాతి సినిమాలో తారక్ బాగా సూట్ అవుతాడని అనుకున్నారట.మరి ఎన్టీఆర్ కి కూడా  శ్యామలన్‌ చెప్పిన స్టోరీ, కేరక్టరైజేషన్‌కి అన్ని కనక నచ్చితే  త్వరలోనే ఎన్టీయార్ హాలీవుడ్‌ లో ఎంట్రీ ఇవ్వబోతున్నాడన్నమాట. ఈ వార్త నిజంగానే ఎన్టీఆర్ అభిమానులకు ఫుల్‌ మీల్స్‌ అంతా ఆనందాన్ని ఇస్తుంది మరి.. !

మరింత సమాచారం తెలుసుకోండి: