విజయ్ సేతుపతి ఉంటే సినిమాకి వెయిట్ వస్తుంది. ఆడియన్స్‌లో ఉన్న క్రేజ్‌తో బిజినెస్‌ మార్క్‌ కూడా  పెరుగుతుంది. ఈ స్టార్డమ్‌నే క్యాష్‌ చేసుకుంటున్నారు తెలుగు మేకర్స్. ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌ కూడా ఈ లిస్ట్‌లో చేరుతున్నాడట. మరి సేతుపతితో త్రివిక్రమ్ ఎలాంటి సినిమా చేయబోతున్నాడనే సందేహం సినీ వర్గాల్లో నెలకొంది.

విజయ్ సేతుపతి 'ఉప్పెన' సినిమాలో విలన్‌గానే చేశాడు. కానీ హీరోయిక్‌ రెస్పాన్స్‌ వచ్చింది. ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో కూడా సేతుపతి పేరు వినిపించినప్పుడు ఆడిటోరియం అరుపులతో నిండిపోయింది. ఈ క్రేజ్‌తోనే టాలీవుడ్‌లో స్టార్ విలన్‌గా మారిపోతున్నాడు విజయ్ సేతుపతి. తమిళ్లో హీరోగా నటిస్తోన్న సేతుపతికి తెలుగు నుంచి విలన్ రోల్స్‌ వరుస కడుతున్నాయి.

విజయ్‌ సేతుపతి ఏ క్యారెక్టర్‌ చేసినా అందులో ఒక ఇంటెన్సిటీ చూపిస్తాడు. పెర్ఫామెన్స్‌తో ఆ రోల్‌ని నెక్ట్స్‌ లెవల్‌కి తీసుకెళ్తాడు. అందుకే 'మాస్టర్' సినిమాలో విజయ్ కంటే విజయ్ సేతుపతి క్యారెక్టర్‌కే ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. ఈ పెర్ఫామెన్స్‌కే త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఫిదా అయ్యాడట. జూ.ఎన్టీఆర్ సినిమాకి సేతుపతిని విలన్‌గా తీసుకోవాలనుకుంటున్నాడట త్రివిక్రమ్.

టాలీవుడ్‌లో వన్‌ ఆఫ్ ది బెస్ట్ పెర్ఫామర్స్ జూ.ఎన్టీఆర్. ఇలాంటి ఆర్టిస్ట్‌తో విజయ్ సేతుపతి పోటీపడితే ఆడియన్స్‌కి ఫుల్‌ కిక్ వస్తుందని చెప్పొచ్చు. ఇక మక్కల్ సెల్వన్‌ ఇమేజ్‌తో తమిళ్లోనూ ఈ సినిమాకి భారీ బిజినెస్ జరిగే అవకాశముంటుంది. మరి వరుస సినిమాలతో బిజీగా ఉన్న విజయ్ సేతుపతి ఈ ప్రాజెక్ట్‌ని ఓకే చేస్తాడా లేదా అనేది చూడాలి.

మొత్తానికి విజయ్ సేతుపతి కోసం దర్శక, నిర్మాతలు పోటీ మీదున్నారు. విలన్ రోల్స్ కు ఫస్ట్ ఆప్షన్ గా మారుతున్నాడు విజయ్ సేతుపతి. ఏమని ఉప్పెన సినిమాలో విలన్ గా నటించాడో గానీ..ఉన్నట్టుండి ఆయన క్రేజ్ ఎక్కడికో పెరిగిపోయింది. అంతేకాదు మాస్టర్ సినిమాలో హీరో కంటే విలన్ క్యారెక్టర్ కే ఎక్కువ రెస్పాన్స్ రావడం గమనర్హం.




మరింత సమాచారం తెలుసుకోండి: