సినిమాల్లో రాణించాలంటే అంత మాములు విషయం కాదు. ఎందుకంటే ఎటువంటి  బ్యాక్ గ్రౌండ్ సపోర్ట్ లేకుండా  సినీ పరిశ్రమలో నిలదొక్కుకోవడం అంటే  కొంచెం కష్టం అయిన పనే అని చెప్పాలి. కానీ నాచురల్ స్టార్ నాని విషయంలో ఆ అంచనాలు అన్ని తారుమారు అయ్యాయి.ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకున్న హీరోల్లో నాని ఒకరు. ఒకసారి ఆయన సినీ ప్రస్థానము విషయానికి వస్తే  సినీ పరిశ్రమలో అసిస్టెంట్ డైరెక్టర్‏గా కెరీర్ ఆరంభించాడు. తరువాత అనుకోకుండా హీరోగా మారాడు. తన విలక్షణమైన నటనతో, హావభావాలతో, డైలాగ్ డెలివరీ తో విభిన్న సినిమాలను చేస్తూ టాప్ హీరోగా ఎదిగాడు.

సినిమా చూస్తున్నంతసేపు నాని సహజ నటన అందరిని ఆకట్టుకునేలా ఉంటుంది. మన ఇంటి పక్క ఉండే అబ్బాయిగా అనిపించేలా ఉంటాడు నాని. అందుకే నేచరల్ స్టార్‏గా పరిశ్రమలో తనదైన శైలీలో అలరిస్తూ దూసుకుపోతున్నాడు.  అష్టాచెమ్మా సినిమా ద్వారా మనకి పరిచయం అయ్యాడు. మొదటి సినిమాతోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని వరుస ఆఫర్లను అందుకున్నాడు నేచురల్ స్టార్. ఇక ఆ తర్వాత దర్శక దిగ్గజం రాజమౌళి ఈగ సినిమాలోనే ఛాన్స్ కొట్టేసాడు. ‘ఈగ’తో నాని స్టార్ డమ్ కూడా పెరిగింది. ఆ తర్వాత నాని ఒకే రోజున “ఎవడే సుబ్రహ్మణ్యం, జెండాపై కపిరాజు” చిత్రాలను విడుదల చేశారంటేనే నాని రేంజ్ ఏలా మారిందో చెప్పుకోవచ్చు.ఆ తరువాత నాని వెనుకకు తిరిగి చూడలేదు.  నానికి 2015 సంవత్సరంలోవిడుదలైన నాని ‘భలే భలే మగాడివోయ్’ టైటిల్‏కు తగ్గట్టుగానే అలరించింది.  ఆ తరువాత ‘నేను లోకల్’తో మురిపించిన నాని, తరువాత ‘మిడిల్ క్లాస్ అబ్బాయి’గానూ ఆకట్టుకున్నాడు.

అటు వెండితెరపై హీరోగా అలరిస్తూనే నిర్మాతగానూ మారాడు నాని. నిర్మాతగా మొదటి సినిమా ‘అ!’ ను నిర్మించాడు. వైవిధ్య కథాంశంతో తెరకెక్కిన ఆ సినిమా మంచి టాక్ తెచ్చుకుంది. ఆ తరువాత విశ్వక సేన్ హీరోగా ‘హిట్’ సినిమాను నిర్మించి ప్రశంసలు అందుకున్నాడు. నాని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి పన్నెండేళ్ళ అయిన.. ఇప్పటికి నాని తన సహజ నటనతో అందరిని అలరిస్తూ వస్తున్నాడు. ఇప్పటి వరకు నాని 25 సినిమాలు పూర్తిచేశాడు. ఇక 25వ సినిమాగా తెరెకెక్కిన వి సినిమా ఓటీటీలో విడుదలై విజయాన్ని నమోదు చేసుకుంది.  త్వరలోనే నాని ‘టక్ జగదీశ్’తో జనం ముందుకు రానున్నాడు. అతని మరో చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’ సెట్స్ పై ఉంది. ఈలా మన అందరిని ఎంతగానో అలంరిస్తున్న నేచురల్ స్టార్ నానికి పుట్టిన రోజు శుభకాంక్షలు చెబుదాం.. !!

మరింత సమాచారం తెలుసుకోండి: