టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస చిత్రాలతో ఫుల్ బిజీ అయిపోతున్నాడు..ప్రస్తుతం చిరూ నటిస్తున్న ఆచార్య సినిమా చివరి దశకు చేరుకుంది.. ఆ తర్వాత మలయాళ చిత్రం లూసిఫార్ రిమేక్ లో నటించనున్నాడు ఈ సీనియర్ హీరో..ఇక లూసిఫర్‌` చిత్రాన్ని తెలుగులో చిరంజీవి చేస్తున్నారనగానే అటు అభిమానుల్లో, ఇటు ఇండ్రస్టీ వర్గాల్లో చాలా ప్రశ్నలు తలెత్తాయి... ఎందుకంటే ఈ సినిమాలో హీరోయిజం, మాస్ ఎలివెంట్స్, ఎంటర్టైనింగ్ అంశాలు అనేవే ఉండవు.. నిజం చెప్పాలంటే మెగాస్టార్ చిరంజీవి రేంజ్‌కి తగ్గట్టుగా ఇందులో ఏమీ లేదు. హీరోయిజం కేవలం సింబాలిక్‌గా మాత్రమే ఉన్న సినిమా అది.రీమేక్‌లో చిరంజీవిని అలాగే చూపిస్తున్నారా? కాదు.. కథలో బోలెడు మార్పు చేర్పులు జరిగాయి.

 కథ పూర్తిగా చిరంజీవి ఇమేజ్‌కు అనుగుణంగా రూపుదిద్దుకుంది. మాతృకలో మోహన్‌లాల్‌ డైరెక్ట్ అవకుండా వెనకుండి కథను నడిపిస్తారు. కానీ, ఈ రీమేక్‌లో చిరంజీవి అలా కాదు. చిరంజీవి పాత్రతోనే కథ ముందుకు సాగుతుంది.ఒరిజినల్‌లో చాలా మలుపులలో మోహన్‌లాల్‌ ప్రమేయం కనిపిస్తుంది గానీ, మోహన్‌లాల్‌ కనిపించరు. రీమేక్‌లో మాత్రం చిరంజీవి కనిపిస్తారు. ఏదేమైనా, చిరంజీవి ఇమేజ్‌కు `లూసిఫర్‌` పూర్తిగా భిన్నమైన సినిమా.`ఈ సినిమా చేయడానికి చిరంజీవి ఎలా ఒప్పుకున్నారు` అనేది చాలా మంది వేస్తున్న ప్రశ్న.

 `ఎన్నాళ్ళు ఒకే టైపు సినిమాలు చెయ్యాలి`.. ఇదీ చిరంజీవి మనసులో మాట. తన కెరీర్‌ని మలుపు తిప్పుకునే దిశగా చిరంజీవి వేస్తున్న మొదటి అడుగు `లూసిఫర్‌`. ఎంతో కసరత్తు చేసిన తర్వాత ఇప్పుడు కథ పర్‌ఫెక్ట్‌గా తయారైందని, చిరంజీవికి `లూసిఫర్‌` నెక్స్ట్ జనరేషన్‌ ఫిల్మ్ అవుతుందని యూనిట్ సభ్యులు గట్టి విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. చిరంజీవి నుంచి అభిమానులు, సామాన్య ప్రేక్షకులు ఆశించే ప్రతి అంశాన్నీ `లూసిఫర్` సినిమా సమపాళ్లలో అందిస్తూనే చిరంజీవిని కొత్తగా చూపిస్తుందట.ఇలాంటి మరెన్నో లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ కోసం మా ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని తప్పకుండా ఫాలో అవ్వండి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: