నితిన్ హీరో గా నటించిన 'అ ఆ' సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయమైనా కథానాయిక అనుపమ పరమేశ్వరన్.. తొలి సినిమా తో హిట్ కొట్టడమే కాకుండా ఆ పాత్ర లో నటనతో అందరిని మెప్పించి మంచి మార్కులు కొట్టేసింది. ఆ తర్వాత ప్రేమమ్ తో హిట్ కొట్టి వెంటనే శతమానం భవతి సినిమా తో హిట్ కొట్టి టాలీవుడ్ లో హ్యాట్రిక్ హిట్ లు కొట్టిన హీరోయిన్ గా అవతరించింది. అయితే ఈ సక్సెస్ ని ఆమె కంటిన్యూ చేయలేకపోయింది.. ఉన్నది ఒక్కటే జీవితం, కృష్ణార్జున యుద్ధం, తేజ్ ఐ లవ్ యు సినిమాలతో వరుస ఫ్లాప్ లను ఎదుర్కొంది.ఆ తర్వాత వచ్చిన రాక్షసుడు పర్వాలేదనిపించుకున్నా ఆమెకు గుర్తింపు రాలేదు.

దాంతో మరోసారి ఆమె తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతుంది.స్టార్ డైరెక్టర్ సుకుమార్ స్టోరీ - స్క్రీన్ ప్లే అందిస్తున్న '18 పేజెస్' సినిమా  లో అనుపమ హీరోయిన్ గా నటిస్తుంది.. నిఖిల్ కథానాయకుడు.ఇది కాకుండా కొన్ని తమిళ, మలయాళ చిత్రాలు కూడా ఆమె చేతిలో ఉన్నాయి.. అయితే ఈ గ్యాప్ లో ఆమె నటించిన ఓ షార్ట్ ఫిలిం కి మంచి ఆదరణ లభిస్తుంది.. యూట్యూబ్ లో మిలియన్స్ వ్యూస్ తో ట్రేండింగ్ లో నిలిచింది ఆ షార్ట్ ఫిలిం. ఆమె బోల్డ్ గా నటించిన ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్ షార్ట్ ఫిల్మ్ మలయాళం మరియు తెలుగు ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటుంది.

 పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ రొమాంటిక్ మూవీని బన్నీ వాస్ నిర్మిస్తున్నారు. ఇది నిర్మాణంలో ఉండగానే అనుపమకు నిఖిల్ సరసన నటించే మరో ఛాన్స్ కూడా వచ్చినట్టు తెలుస్తోంది.  నిఖిల్ హీరోగా గతంలో వచ్చిన 'కార్తికేయ' సినిమా మంచి హిట్టయింది. చందు మొండేటి దర్శకత్వంలోనే నిఖిల్ హీరోగా దీనికి సీక్వెల్ నిర్మిస్తున్నారు. ఇందులో హీరోయిన్ గా అనుపమను తీసుకుంటున్నట్టు తాజా సమాచారం. ఈ నెల 26 నుంచి షూటింగును నిర్వహించే ఈ 'కార్తికేయ 2' చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్, టీజీ విశ్వప్రసాద్ కలసి నిర్మిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: