ఖైదీ సినిమా తో సూపర్ హిట్ అందుకున్న కార్తీ ప్రస్తుతం సుల్తాన్ అనే సినిమా లో నటిస్తున్నారు.. సూర్య తమ్ముడిగా ఇండస్ట్రీ లోకి వచ్చిన కార్తీ తనకంటూ మంచి గుర్తింపు ను తెచ్చుకున్నాడు.. ఆవారా చిత్రం నుంచి టాలీవుడ్ లో మంచి ఫ్యాన్ బేస్ ను ఏర్పరుచుకున్న కార్తీ కొన్ని సినిమాలుగా హిట్ కోటలేకపోయాడు. ఖైదీ తో కం బ్యాక్ చేశాడు.. ఇప్పుడు సుల్తాన్ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ  చిత్రానికి సంబంధించి ఫస్ట్ లుక్ ను దసరా సందర్భంగా రిలీజ్ చేశాడు.. ఇందులో కార్తి లుక్ అందరినీ ఆకట్టుకుంది.

గతంలో శివ కార్తికేయన్, కీర్తి సురేష్ లతో రెమో తీసిన బక్కియరాజ్ కణ్ణన్ దీనికి దర్శకుడు.. ప్రముఖ తమిళ నిర్మాత ఎస్.ఆర్.ప్రభు ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేశాడు.  రష్మిక మందన్న హీరోయిన్ కావడం మరో అదనపు ఆకర్షణ. తెలుగులో రష్మిక కు మంచి ఫాలోయింగ్ ఉంది.. ఆమె చిత్రాలు సూపర్ హిట్ అవుతున్న నేపథ్యంలో ఈ సినిమా పై మంచి అంచనాలు ఉన్నాయి.  ఇటీవలే ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకుని రిలీజ్ కి రెడీ గా ఉంది.కార్తీ ఒక తమిళ సినిమాలో నటిస్తున్నాడంటే దానికి తెలుగులో కూడా క్రేజ్ ఏర్పడుతుంది. ఆ చిత్రం అనువాద హక్కుల కోసం తెలుగు నిర్మాతలు పోటీపడుతుంటారు. అలాగే తాజాగా కార్తీ నటించిన 'సుల్తాన్' చిత్రం డబ్బింగ్ రైట్స్ కోసం కూడా పోటీ ఏర్పడింది.

ఈ క్రమంలో ప్రముఖ పంపిణీదారు వరంగల్ శ్రీను ఈ 'సుల్తాన్' అనువాద హక్కులను రెండు రాష్ట్రాలకూ కలిపి సుమారు 7 కోట్లకు సొంతం చేసుకున్నట్టు తాజా సమాచారం. తెలుగులో కూడా 'సుల్తాన్' పేరుతోనే ఏప్రిల్ 2న ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తారు. ఇందులో బిజీ స్టార్ రష్మిక కథానాయికగా నటించడం విశేషం. గతంలో తను నటించిన ఆవారా, నా పేరు శివ, ఖాకి, ఖైదీ వంటి సినిమాలు తెలుగు ప్రేక్షకులను కూడా అలరించాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: