ప్రస్తుతం చేస్తున్న వకీల్ సాబ్ , ఏకే రీమేక్ సినిమాల్తో పాటు మరో రెండు సినిమా లు ఓకే చేసిన పవన్ కళ్యాణ్ ఎన్నికల్లోపు వీలై నన్ని సినిమాలు చేసి రాజకీయాల్లో కి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు..రెండు పడవలమీద ప్రయాణం ఎంతవరకు సక్సెస్ అవుతుందేమో కానీ వరుస సినిమాలు మాత్రం చేసుకుంటూ పోతున్నాడు.  రాజకీయాలకు చిన్న పాజ్ ఇచ్చి పవన్ కళ్యాణ్ వరుస సినిమాలు చేస్తుండగా వకీల్ సాబ్ సినిమా రిలీజ్ కి రెడీ గా ఉంది. దిల్ రాజు నిర్మాతగా వస్తున్న ఈ సినిమాకి  వేణు శ్రీరామ్సినిమా కి దర్శకుడు..

ఇకపోతే విలక్షణ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం అయిన విరూపాక్ష పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా అంచనాలను మించే విధంగానే ప్లాన్ చేస్తున్నట్టుగా ఒక్కో డీటెయిల్ కోసం వినబడుతుంటే తెలుస్తుంది.అలా నిన్ననే ఈ సినిమాలో ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ కోసమే టాక్ బయట కు వచ్చింది.కానీ ఇప్పుడు మాత్రం ఓ సాంగ్ విషయంలో టాక్ పవన్ అభిమానులకు పిచ్చ కిక్ ఇస్తుంది. “గబ్బర్ సింగ్” సినిమాలో టైటిల్ సాంగ్ కు సూపర్బ్ గా కొరియోగ్రాఫ్ చేసిన గణేష్ మాస్టర్ తో ఈ సినిమాలో కూడా ఒక సాలిడ్ సాంగ్ ను చేశారట.

లాక్ డౌన్ కన్నా ముందే 200 మంది ఆర్టిస్టులతో ఈ సాంగ్ ను తెరకెక్కించారట. ఇది మాత్రం థియేటర్స్ లో దుమ్ము లేపే విధంగా ఉంటుంది అని గణేష్ మాస్టర్ లేటెస్ట్ గా ఓ ఇంటర్వ్యూలో ఇచ్చి న స్టేట్మెంట్ ద్వారా కన్ఫర్మ్ అయ్యింది. ఇప్పుడు ఇదే కట్ పవన్ ఫ్యాన్స్ లో వైరల్ అవుతుంది. మరి ఈ భారీ చిత్రంలో ఆ సాంగ్ ఎలా ఉంటుందో తెలియాలి అంటే ఇంకొ న్నాళ్ళు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: