రాజ్ తరుణ్  మొదటి సినిమా ‘ఉయ్యాలా జంపాలా’తో హీరోగా మంచి గుర్తింపు పొందాడు . ఆ తర్వాత ‘సినిమా చూపిస్తా మామ’, ‘కుమారీ 21ఎఫ్’, వంటి సినిమాలతో సూపర్ హిట్స్ అందుకున్నాడు ఈ యంగ్ హీరో. ఇక ఆ తర్వాత ‘సీతమ్మ అందాలు, రామయ్య సిత్రాలు’ వంటి సినిమాలు తీసిన అవి ఆశించినంతగా విజయాలను సాధించలేకపోయాయి.వరసగా ఎన్ని సినిమాలు చేసిన రాజ్ తరుణ్ కి మాత్రం ఒక్క హిట్ కూడా రాలేదు. రొటీన్ సినిమాలు చేయడం వల్లేనేమో రాజ్ తరుణ్ కి హిట్ రావట్లేదు అని టాక్. అయితే ఈ మద్యనే డైరెక్టర్ విజయ్ కుమార్ కొండా డైరెక్షన్లో వచ్చిన ‘ఓరెయ్ బుజ్జిగా’ ఓటీటీ వేదిక ఆహాలో విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. దీంతో వరుస ఆఫర్లను అందుకుంటున్నాడు ఈ యంగ్ హీరో.ఇక మళ్ళీ ఒరేయ్ బుజ్జిగా డైరెక్టర్ విజయ్ కుమార్‏ డైరెక్షన్లో మరో సినిమాను చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు ఈ యంగ్ హీరో. ఈ చిత్రంతోపాటు.. డ్రీమ్ టౌన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై మోహన్ వీరంకి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. ఇందులో వర్ష బొల్లమ్మ హీరోయిన్‏గా నటించనున్నట్లుగా తెలుస్తోంది. కాకపోతే ఇన్ని సినిమాలు నటిస్తున్న కూడా రాజ్ తరుణ్ కి ఎప్పుడు హిట్ వస్తుందో అర్థం కావట్లేదు. ఆయన ఈ మద్యనే నటించిన కొత్త సినిమా పవర్ ప్లే త్వరలోనే విడుదల కాబోతుంది. ఈ సినిమా రాజ్ తరుణ్ కి హిట్ ఇస్తుందో లేదో చూడాలి. ఇక రాజ్ తరుణ్ కి యూత్ లో బాగా క్రేజ్ ఉంది. ఈ క్రేజ్ కి ఒక సూపర్ హిట్ తోడైతే ఆయన రేంజ్ మారిపోతుంది. ఇతర హీరోస్ కొత్త కథలతో వస్తుంటే రాజ్ తరుణ్ కూడా ఇప్పుడు వాళ్ళ బాటలోనే పవర్ ప్లే సినిమాని చేశారు.ఈ సినిమా ఏ రేంజ్ లో హిట్ అవుతుందో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: