తెలుగులో మొదటినుంచి విభిన్నమైన సినిమాలు చేస్తూ వస్తున్న రానా దగ్గుపాటి కి బాహుబలి సినిమాతో దేశమంతటా పేరు వచ్చింది. ఈ సినిమా తర్వాత రానా సినిమాలని ఇంకా జాగ్రత్తగా ఎంచుకుంటున్నారు. ఇక ఇప్పుడు రానా దగ్గుబాటి, సాయిపల్లవి హీరో హీరోయిన్లుగా వేణు ఊడుగుల దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'విరాటపర్వం'. ఇక ఆయన నటిస్తున్న విరట పర్వం  సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ప్రస్తుతం షూటింగ్‌ హైదరాబాద్‌లో జరుగుతోంది. అయితే ఇప్పుడు సోషల్ మీడియా లో నాగ చైతన్య , రానా దగ్గుపాటి చిన్నపుడు దిగిన ఫోటో వైరల్ అవుతుంది. ఈ ఫోటో లో రానా, నాగ చైతన్య కాలేజ్ టైం లో నిర్మాత సురేష్ బాబు తో కలిసి దిగిన ఫోటో చూసి అసలు ఇలా ఉండేవాళ్ళ ఇద్దరు అని ఆశ్చర్యనికి లోనవుతున్నారు. అప్పుడు అలా ఉండేవాళ్ళు ఇప్పుడు టాప్ హీరోస్ అవ్వడం నిజంగా విశేషమే. ఇక నాగ చైతన్య ప్రస్తుతం లవ్ స్టొరీ సినిమా షూటింగ్ లో ఉన్నారు. ఇక రానా దగ్గుపాటి విరటపర్వం సినిమాతో పాటు అరణ్య సినిమాని కూడా విడుదలకి సిద్ధం చేస్తున్నాడు. ఈ సినిమా తెలుగు , తమిళ్ మరియు హిందీ లో కూడా విడుదల కాబోతుంది. ఈ సినిమా లో రానా కొత్త లుక్ లో కనిపించబోతున్నారు. తమిళ్ లో మంచి పేరు ఉన్న ప్రభు సోలామాన్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.అలాగే ఈ మద్యనే పవన్ కళ్యాణ్ తో కలిసి ఒక సినిమాని కూడా రానా అంగీకరించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కూడా ప్రస్తుతం జరుగుతుంది. మలయాళం లో విడుదలై సూపర్ హిట్ అయిన అయ్యప్పన్ కోషియన్ సినిమాని తెలుగులో కి రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాలో ఇంకొక విశేషం ఏంటి అంటే త్రివిక్రమ్ ఈ సినిమాకి డైలాగ్స్ అందిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: