ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...ఒక మనిషి జీవితాన్ని ఎప్పుడైనా ఎలాగైనా మార్చగల సత్తా..కేవలం ఒక్క సక్సెస్ కు మాత్రమే ఉంటుంది.ఒక విజయం సాధిస్తే చాలు మనమేంటో ప్రపంచానికి తెలుస్తాము.ఇక విజయమనేది లేకపోతె ఇక్కడ రాజు.. బంటవుతాడు. అది అనుగ్రహిస్తే బంటు.. రాజవుతాడు. ఇప్పటివరకూ ప్లాపుల్లో ఉన్న ఎంతో మంది హీరోలకు హిట్లిచ్చి ఆదుకున్న దిల్ రాజు సైతం.. ఇప్పుడు హిట్టు కొట్టగానే ఓ హీరో వెంటపడుతున్నాడు. అతనెవరో కాదు తెలుగు సినిమా ఆడియన్స్ ఎంతగానో ఇష్టపడే మన అల్లరి నరేష్. ఇటీవల వచ్చిన 'నాంది' చిత్రం హిట్ అవ్వడంతో ఎలాగైనా సరే నరేష్ తో ఓ సినిమా నిర్మించి క్యాష్ చేసుకోవాలని దిల్ రాజు భావిస్తున్నాడు.అందుకే హైదరాబాద్ దసపల్లా హోటల్‌లో "నాంది అప్రిసియేషన్ మీట్ "ను ఏర్పాటు చేసి అందరికీ సర్ప్రైజ్ ఇచ్చాడు దిల్ రాజు. ఈ వేడుకలో 'నాంది' టీం ను అభినందించడమే కాకుండా..నరేష్ ను తెగ పొగిడేశారు దిల్ రాజు. సరైన కథ, దర్శకుడు దొరికితే నరేష్ తో సినిమా చెయ్యడానికి నేను రెడీ అంటూ బంపర్ ఆఫర్ ఇచ్చేసాడు. ఒకవేళ నరేష్ కు ఏదైనా కథ నచ్చితే నన్ను అప్రోచ్ అవ్వచ్చు అని కూడా చెప్పుకొచ్చాడు.


'ఏమైనా ప్లాపుల్లో ఉన్న హీరో ఓ హిట్టు కొడితే.. పరిస్థితి ఇంత మారిపోతుందా' అని సందేహించే వారికి అల్లరి నరేష్ ను ఓ ఉదాహరణగా చెప్పుకోవచ్చు.లేకపోతే ఇన్నాళ్లు అతన్ని పట్టించుకోని దిల్ రాజు.. ఇప్పుడు ఇంత బంపర్ ఆఫర్ ఇవ్వడమేంటి? ఇదిలా ఉండగా.. గతంలో దిల్ రాజు నిర్మించిన 'మహర్షి' చిత్రంలో కూడా అల్లరి నరేష్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసాడు. అందులో కూడా నరేష్ సీరియస్ పాత్రనే పోషించాడు.ఇక అల్లరి నరేష్ పోషించిన ఆ పాత్రకి కూడా మంచి గుర్తింపు వచ్చింది. ఇక నాంది సినిమాతో అల్లరి నరేష్ మునుపటి వైభవాన్ని పొంది ఇక నుంచి మంచి హిట్లు అందుకోవాలని ఆశిద్దాం.. ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో ఆసక్తికరమైన విషయాలు గురించి తెలుసుకోండి....

మరింత సమాచారం తెలుసుకోండి: