దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా "ఆర్ఆర్ఆర్". ఈ సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటుస్తున్నారు. సినిమాలో ఎన్టీఆర్ గోండు బెబ్బులి కొమురం భీమ్ గా నటిస్తుండగా...రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఇద్దరు హీరోల వీడియోలను విడుదల చేయగా రికార్డు స్థాయిలో వ్యూవ్స్ వచ్చాయి. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ కు హీరోయిన్ గా ఒలీవియా మోరీస్ హీరోయిన్ గా నటిస్తుండగా...రామ్ చరణ్ కు హీరోయిన్ గా అలియా భట్ నటిస్తోంది. ఇక అలియా భట్ ఆర్ఆర్ఆర్ సినిమాతో పాటు బాలీవుడ్ సినిమా "గంగుబాయ్" లో నటిస్తోంది. ఈ సినిమాలో అలియా సెక్స్ వర్కర్ పాత్రలో నటించింది. సెక్స్ వర్కర్ గా ఉన్న గంగుబాయ్ మాఫియా డాన్ గా రాణిగా ఎలా ఎదిగింది అన్నది సినిమాలో చూపించబోతున్నారు. ఈ చిత్రానికి సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక తాజాగా ఈ సినిమా టీజర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

కాగా ఈ సినిమాకు ఆర్ఆర్ఆర్ లో అలియా పక్కన హీరోగా నటిస్తున్న చరణ్ సపోర్ట్ చేస్తున్నాడు. అలియా భట్ "గంగుబాయ్" టీజర్ ను చరణ్ సోషల్ మీడియాలో షేర్ చేసి అలియా భట్ పై ప్రశంసలు కురిపించారు. మరోవైపు ఆర్ఆర్ఆర్ దర్శకుడు జక్కన్న కూడా అలియా "గంగూబాయ్" టీజర్ ను షేర్ చేసి ప్రశంసలు కురిపించారు. గంగుబాయ్ లుక్ ఇంప్రెసివ్ గా ఉందని..సంజయ్ లీల బన్సాలీ సినిమాను థియేటర్ లో చూడటానికి వెయిట్ చేస్తున్నానని రాజమౌళి పేర్కొన్నారు. ఇక చరణ్ చరణ్, రాజమౌళి సపోర్ట్ ఇస్తుండటం తో చెర్రీ అభిమానులు సైతం అలియా సినిమాకు గుడ్ లక్ చెబుతున్నారు. అలియా భట్ ఆర్ఆర్ఆర్ సినిమాలో నటించడంతో ఇటు టాలీవుడ్ లో ఫ్యాన్స్ ను సంపాదించుకోవడం తో పాటు తన బాలీవుడ్ సినిమాలకు కూడా సపోర్ట్ ను అందుకుంటోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: