దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ అరుదైన రికార్డులను బద్దలు కొట్టిన "బాహుబలి"సినిమాను ఇప్పుడప్పుడే ఎవరు మర్చిపోరు. బాహుబలి సినిమా దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంది. బాహుబలి సినిమాలో నటించిన ప్రభాస్ కి  ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా సినిమాలు చేసే అవకాశాన్ని బాహుబలి కల్పించింది. బాహుబలి సినిమా ద్వారా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంత బిజీగా ఉన్నారు.అయితే ఎప్పుడో ఏడు సంవత్సరాల క్రిందట వచ్చిన బాహుబలి చిత్రం ప్రస్తావన ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే? బాహుబలి సినిమా మొదటి పోస్టర్ అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. నీటిలో ఓచేయి చేతిలో ఓ బిడ్డ ఉన్న పోస్టర్ చూడగానే ఈ సినిమాపై ఎంతో ఆసక్తిని రేకెత్తించింది. ఈ పోస్టర్ గురించి ఇండస్ట్రీ మొత్తం హాట్ టాపిక్ గా మారిపోయింది.

ఈ సినిమాలో ప్రభాస్ ద్విపాత్రాభినయంలో నటించారు.అమరేంద్ర బాహుబలి కొడుకు మహేంద్ర బాహుబలి అనే విషయం మనకు తెలిసిందే. అయితేఎలాగైనా మాహిష్మతి సామ్రాజ్యానికి రాజు కావాలన్న ఉద్దేశంతో బళ్ళాలదేవుడు తన తల్లికి మాయ మాటలు చెప్పడంతో శివగామి స్వయంగా అమరేంద్ర బాహుబలిని చంపిస్తుంది.తర్వాత నిజం తెలుసుకున్న శివగామి ఎలాగైనా తన అమరేంద్ర బాహుబలి కొడుకుని బతికించాలి అన్న ఉద్దేశంతో తన కొడుకు మహేంద్ర బాహుబలినీ రాజుగా ప్రకటించే మాహిష్మతి కోట నుంచి తప్పించుకోవాలని ప్రయత్నం చేయగా రమ్యకృష్ణను చంపుతారు. ఎలాగైనా బిడ్డను బ్రతికించాలి అనే ఉద్దేశంతో ఆ విధంగా చేతిలో మహేంద్ర బాహుబలిని పట్టుకొని ఉండటం, తరువాత ఆ సంఘటనను గిరిజన ప్రాంత వాసులు చూసి మహేంద్ర బాహుబలిని పెంచుకోవడం జరుగుతుంది.

చిన్నప్పటి మహేంద్ర బాహుబలి పాత్రలో నటించిన ఆ చిన్నారి కేవలం 18 రోజుల వయసు మాత్రమే.పుట్టిన 18 రోజులకే ప్రపంచ వ్యాప్తంగా గర్వించదగ్గ పాత్రలో నటించి సంచలనం సృష్టించింది. మహేంద్ర బాహుబలి ప్రభాస్ చిన్ననాటి పాత్రలో నటించిన ఆ చిన్నారి పేరు "తన్వి"(అక్షిత). ప్రస్తుతం తన్వి వయస్సు ఏడు సంవత్సరాలు. ప్రస్తుతం ఈ చిన్నారి తన్వి తన తండ్రి దగ్గర కూర్చుని చూస్తున్నటువంటి క్యూట్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ పాప బాహుబలి టీమ్ లో పనిచేసే ఓ ఎగ్జిక్యూటివ్ కూతురని తెలుస్తోంది. అయితే చిన్నప్పటి మహేంద్ర బాహుబలి (తన్వి) నీ మీరు ఓ లుక్కేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: