నేచురల్ స్టార్ నాని అష్టా చమ్మా సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. ఈ సినిమా తరువాత రైడ్, స్నేహితుడా, భీమిలి కబడ్డీ జట్టు, అలా మొదలైంది, ఇలాంటి సినిమాలలో తనదైన శైలిలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అతి తక్కువ టైమ్ లోనే మంచి మంచి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ ప్రత్యేకతలే నాని ని నాచురల్ స్టార్ గా ఎదిగేలా చేశాయి. దీని గురించి తెలుసుకుందాం.


 ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన అష్టా చమ్మా సినిమాతో పరిచయం అయ్యాడు నాని. ఆ సినిమా విడుదలైనప్పుడు నాన్న ఇంత పెద్ద హీరో అవుతాడని అనుకోలేదు. ఆ చిత్రంలో కలర్స్ స్వాతి తప్ప మరో ఫేస్ ఎవరికీ తెలియదు. ఆ తర్వాత నాని ఇంతింతై అన్నట్టుగా సినిమాతో తనలోని టాలెంట్ ను తాండ పెడుతూ నాచురల్ స్టార్ గా టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకంటూ సపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు.


 ఏ అండ లేకుండా వచ్చిన ఈ కుర్రాడు తర్వాత రోజుల్లో సంచలనాలు సృష్టి ఇస్తాడని ఇప్పుడు ఇదే జరుగుతుంది. చిరంజీవి రవితేజ తర్వాత ఆ స్థాయిలో ఇమేజ్ తెచ్చుకున్న నటుడు నాని. ఫిబ్రవరి 24న నాని పుట్టినరోజు. అప్పటికే శ్రీనువైట్లతో డి బాపు రాధాగోపాలం సినిమాలకు సహాయ దర్శకుడిగా పనిచేసే దర్శకత్వం కోసం కథ సిద్ధం చేసుకుంటున్న రోజులవి. అలాంటి సమయంలో ఓ సినిమా ఎడిట్ సూట్ లో  ఇంద్రగంటి  ఏదో పనిమీద వచ్చినానిని చూడటం  ఈ కుర్రాడెవడో బాగున్నాడు అని తన సినిమాలో హీరోగా అవకాశం ఇవ్వడంతో నాని దశ మారిపోయింది.


 అది మొదలు ఇప్పుడు ఇండస్ట్రీలో తనకంటూ ఓ చిన్న సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాడు నాచురల్ స్టార్ నాని. చిరంజీవి తర్వాత ఏ అండదండలు లేకుండా ఇంతగా మార్కెట్ ఫ్యాన్స్ సంబంధించింది రవితేజ తరువాత నానినే. తరువాత పిల్ల జమిందార్ విజయాలతో హీరో అయిపోయాడు. 2012లో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈగ చిత్రంతో నేషనల్ వైడ్ ఫేమస్ అయిపోయాడు.  ఆ తర్వాత బలే బలే మగాడివోయ్ సినిమాతో నాని కాస్త నేచురల్ స్టార్ అయ్యాడు.  ఈ ప్రయాణంలో ఎటో వెళ్ళిపోయింది మనసు ఉత్తమ నటుడిగా నంది అవార్డు, భలే భలే మగాడివోయ్ సినిమా కు బెస్ట్ యాక్టర్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం నా ని టక్ జగదీష్ మూవీతో అయితే సుందరానికి సినిమాలతోపాటు శ్యామ్ సింగరాయ్ సినిమాలో నటిస్తున్నాడు. పక్కింటి కుర్రాడి పాత్ర లో అత్యంత సహజంగా నటించడం నాని స్పెషాలిటీ. అదే నాని సామాన్య ప్రేక్షకులకు దగ్గర ఎలా చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: