నందమూరి బాలకృష్ణ ఈయన తన సినిమాలో నటనతో, డైలాగ్స్ తో ఎంతో మంది ప్రేక్షకుల మనసులలో స్థానం సంపాదించుకున్నారు. నందమూరి బాలకృష్ణ కు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభిమానులు ఉన్నారు. బాలకృష్ణ కు కూడా ఫ్యాన్స్ ఫాలోయింగ్ చాలానే ఉందని చెప్పవచ్చు. ఇక బాలకృష్ణ ఈమధ్య  సినిమాలకి కొంచెం దూరంగా ఉన్నాడు. ప్రస్తుతం బాలయ్య బోయపాటి శ్రీను దర్శకత్వంలో బిబి 3 వర్కింగ్ టైటిల్ తో ఓ సినిమా చేస్తున్నాడు . బాలకృష్ణ  రియల్ ఎస్టేట్ రంగంలో కి అడుగు పెట్టారు. ఈ మధ్యనే బాలకృష్ణ కొత్త ఇంటిని కొనుగోలు చేశారు. ఆ ఇల్లు ఎక్కడ ఉంది ఏమిటి అన్న విషయాల గురించి తెలుసుకుందాం.



 నందమూరి నటసింహం బాలకృష్ణ హైదరాబాద్ లో మరో కొత్త ఇంటిని కొనుగోలు చేశారు. ఈ ఇంటి విలువ దాదాపు 15 కోట్లు. 15 కోట్లు విలువైన ఇంటిని హైదరాబాద్ జూబ్లీ హిల్స్ ఏరియాలో కొనుగోలు చేసినట్లు సమాచారం. గత కొన్ని ఏళ్లుగా బాలయ్య సినీరంగంలోని ఇచ్చే డబ్బులను రియల్ ఎస్టేట్ రంగంలో పెడుతున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ, విశాఖపట్నం, అమరావతి లో ప్రాపర్టీ లను కొనుగోలు చేశాడు. అనంతపూర్ లో కూడా పలు ప్రాపర్టీ లను బాలయ్య కొనుగోలు చేశాడు.


 ఆంధ్రప్రదేశ్ లో రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెట్టిన బాలకృష్ణ ఇప్పుడు హైదరాబాదులో కూడా వరుస ప్రాపర్టీ లు కొనుగోలు చేయాలనే నిర్ణయానికి వచ్చారు.  ఇప్పటికే పలు ప్రాపర్టీ లో కొనుగోలు చేసి మంచి రేటు రాగానే అమ్మేస్తున్నారు. ఈ రకంగా సినిమాల్లోనే కాక రియల్ ఎస్టేట్ రంగంలో కూడా మంచిగానే ఆదాయం సంపాదిస్తున్నారు. తాజాగా హైదరాబాద్ లోని ఓ భవంతిని ఫిబ్రవరి11న కొనుగోలు చేశారు.


 ఈ ప్రాపర్టీ నందమూరి బాలకృష్ణ నడింపల్లి సత్య శ్రావణి నుంచి కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. గ్రౌండ్ ఫ్లోర్ కాకుండా మరో రెండు అంతస్తులు కలిగిన భవంతిని 9395 చదరపు అడుగులు ఉందట. ఈ ప్రాపర్టీని బాలయ్య వసుంధరాదేవి దంపతులు జంటగా కొనుగోలు చేసినట్టు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ను బట్టి తెలుస్తోంది. ప్రస్తుతం బాలయ్య బోయపాటి శ్రీను దర్శకత్వంలో బీబీ 3 వర్కింగ్ టైటిల్ తో ఓ సినిమా చేస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: