ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...నేచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎలాంటి సపోర్ట్ లేకుండా స్టార్ హీరో అయ్యాడు..మొదట్లో అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన నాని 'అష్టా చమ్మా' సినిమాతో హీరోగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. నిజానికి ఆ చిత్రంలో నానిని హీరోగా అనుకోలేదు మన ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు. ఓ పెద్ద ఫ్యామిలీకి చెందిన హీరోతో ఆ సినిమా చెయ్యాలి అనుకున్నారు. కానీ చివరి నిమిషంలో అతను హ్యాండ్ ఇవ్వడంతో.. ఎవ్వరూ ఊహించని విధంగా నానిని ఫైనల్ చేసేసారు. ఇంకో విషయం ఏమిటంటే.. ఆ చిత్రానికి గాను నానికి పారితోషికం ఇవ్వలేదట. నాని కూడా ఏమీ ఆశించకుండానే అవకాశం రావడమే గొప్ప అన్నట్టు ఆ సినిమాని కంప్లీట్ చేసాడు.


ఇక అప్పటి నుండీ నాని ప్రయాణం అందరికీ తెలిసిందే. 'రైడ్' 'భీమిలి కబడ్డీ జట్టు' 'అలా మొదలైంది' వంటి డిఫరెంట్ సినిమాలు చేస్తూ దర్శకధీరుడు రాజమౌళి కంట్లో పడ్డాడు.అలా నానికి 'ఈగ' సినిమాలో అవకాశం దక్కింది. అయితే అటు తరువాత ఎన్నో ప్లాప్ లు మూటకట్టుకున్న నాని.. మారుతీ డైరెక్షన్లో వచ్చిన 'భలే భలే మగాడివోయ్' చిత్రంతో కోలుకున్నాడు. అక్కడి నుండీ నాని జయాపజయాలను లెక్కచెయ్యకుండా దూసుకుపోతున్నాడు. త్వరలో 'టక్ జగదీష్' తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు నాని. ఇక నాని తన కెరీర్ లో ఈ సినిమాలని రిజెక్ట్ చేశాడట... అవి ఏంటంటే...సాయి కుమార్ తనయుడు నటించిన సుకుమారుడు, నితిన్ గుండె జారి గళ్లంతయ్యిందే,నాగ చైతన్య తడాఖా,రాజ్ తరుణ్ నటించిన ఉయ్యాల జంపాల,సాయి ధరమ్ తేజ్ సుప్రీమ్ సినిమా,నాగార్జున ఊపిరి సినిమా,మహానటిలో ఏ ఎన్నార్ పాత్ర,జాను సినిమా, శ్రీకారం సినిమాలను నాని రిజెక్ట్ చేశాడట... ఇంకా ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...


మరింత సమాచారం తెలుసుకోండి: