బిగ్ బాస్ సీజన్ ఫోర్ ముందు వరకు అరియానా గ్లోరీ అంటే తెలుగు వారికి పెద్దగా పరిచయం లేని పేరు అయ్యుండొచ్చు.. కానీ బిగ్ బాస్ సీజన్ లో ఎంటర్ అయి ఏకంగా టాప్ ఫైవ్ ఫైనలిస్టులో నిలిచే సరికి  తెలుగు వారిలో ఆమె క్రేజ్ అమాంతం పెరిగి పోయింది..అయితే బిగ్ బాస్ లో తళుక్కున మెరిసిన అందరిని ఈసారి సినిమా అవకాశాలు చాలా త్వరగానే వరించాయి. ఇప్పటికే బిగ్ బాస్ సీజన్ ఫోర్ లో మెరిసిన అందరు కంటెస్టెంట్ లు అందరికీ ఇప్పటికే వరుస సినిమా అలాగే టెలివిజన్ డిజిటల్ అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. తాజాగా అందుతున్న సమాచారం మేరకు అరియానాకి కూడా ఒక సినిమా అవకాశం వచ్చిందని అంటున్నారు. 

తాజాగా ఒక దర్శకుడు ఈ భామకు ఒక రోల్ ఆఫర్ చేయగా ఆ రోల్ చేయడానికి గానూ ఆమె షాకింగ్ రెమ్యూనరేషన్ చెప్పిందట.. ఏకంగా ఒక రోజు నటించడానికి ఆమె లక్ష రూపాయల రెమ్యూనరేషన్ డిమాండ్ చేసినట్లు చెబుతున్నారు. అయితే లక్ష రూపాయలు ఇవ్వడానికి ఆ దర్శకుడు ససేమిరా అనడంతో భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు వస్తాయని భావించి దీనిని చేర్చుకోవడానికి సిద్ధంగా లేని అరియానా చాలా బేరసారాల తరువాత రోజుకు పాతిక వేల రెమ్యూనరేషన్ తో నటించేందుకు ఒప్పుకున్నట్లు చెబుతున్నారు.

అంతేకాక ఆఫ్ సిటీ షూటింగ్ కి వెళ్లేందుకు ఫ్లైట్ టికెట్స్ కూడా మేమే చెయ్యాలా అని దర్శక నిర్మాతలు అడిగితే లేదు లేదు నేనే చేసుకుంటానని ఆమె సమాధానం ఇచ్చినట్లు చెబుతున్నారు. ఇక ఈ భామ బిగ్ బాస్ హౌస్ లో కమెడియన్ అవినాష్ తో చేసిన రొమాన్స్ బాగా పాపులర్ అయ్యింది..ఇద్దరూ తమ మధ్య స్నేహం తప్ప ఏమీ లేదని చెబుతున్నా ఇద్దరి మధ్య ఏదో ఉందనే ప్రచారం మాత్రం జరుగుతూనే ఉంటుంది. అదే వీరి క్రేజ్ కి కారణం అయ్యింది అని కూడా చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: