ప్రస్తుతం టాలీవుడ్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. టాలీవుడ్ జక్కన్న ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీగా ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీం పాత్ర చేస్తుండగా రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్ర చేస్తున్నారు. అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాని డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య ఎంతో భారీ ఖర్చుతో అత్యున్నత సాంకేతిక విలువలతో నిర్మిస్తున్నారు.

సముద్ర ఖని, శ్రియ శరన్, అజయ్ దేవగన్ తదితరులు ముఖ్య పాత్రలు చేస్తున్నారు ఈ సినిమా యొక్క ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ తో పాటు చరణ్, ఎన్టీఆర్ ల ఫస్ట్ లుక్ టీజర్స్ ఇటీవల యూట్యూబ్ లో రిలీజ్ అయి పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. ఈ మూవీ ఈ ఏడాది అక్టోబర్ 13న రిలీజ్ కానుంది. ఇక దీని తరువాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఆర్ట్స్, హారిక హాసిని క్రియేషన్స్ సంస్థలు కలిసి నిర్మించే ప్రతిష్టాత్మక సినిమాలో నటించనున్నారు ఎన్టీఆర్. మంచి యాక్షన్ తో కూడిన పొలిటికల్ డ్రామా మూవీగా రూపొందనున్న ఈ మూవీలో ఎన్టీఆర్ ఒక అద్భుతమైన మాస్ పాత్ర చేస్తున్నట్లు టాక్. థమన్ మ్యూజిక్ అందించనున్న ఈ మూవీ లో ఎన్టీఆర్ కి జోడిగా ఒక బాలీవుడ్ భామ నటించనున్నట్లు టాక్. 

అయితే దీని తరువాత కోలీవుడ్ యువ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఒక సినిమా చేయనున్నారు అనేది రెండు రోజులుగా పలు టాలీవుడ్ వర్గాల్లో గట్టిగా వినిపిస్తున్న వార్త. నిజానికి త్రివిక్రమ్ మూవీ తరువాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఒక సినిమా చేస్తారని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆ మూవీ యొక్క స్టోరీ సిద్ధం అవడానికి ఎంతో సమయం పడుతుందని, ఇక ఇటీవల తాను సిద్ధం చేసిన ఒక అద్భుతమైన కథని ఎన్టీఆర్ కి వినిపంచి ఆమోదం అందుకున్న అట్లీ ప్రస్తుతం దాని స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నట్లు చెప్తున్నారు. అయితే ఈ మూవీ పక్కాగా ఎప్పుడు పట్టాలెక్కుతుంది, అలానే దీనిని త్రివిక్రమ్ మూవీ తరువాతనే ఎన్టీఆర్ చేస్తారా లేక మరింత టైం పడుతుందా అనేది మాత్రం తెలియాల్సి ఉందని అంటున్నారు....!!

మరింత సమాచారం తెలుసుకోండి: