కమెడియన్ అలీ పవన్ కళ్యాణ్ ల మధ్య స్నేహం పవన్ సినిమా రంగంలోకి ఎంట్రీ ఇవ్వని రోజుల నుండి కొనసాగుతూనే ఉంది. ఆమధ్య ఎన్నికల సమయంలో మాత్రం పవన్ అలీ ల మధ్య చిన్న గ్యాప్ ఏర్పడటంతో రాజకీయంగా పవన్ ను టార్గెట్ చేస్తూ అలీ అప్పట్లో కొన్ని పరోక్ష కామెంట్స్ చేసాడు.


అప్పుడు ఆవిషయాలు దుమారాన్ని లేపడంతో అలీ వెంటనే దిద్దుబాటు చర్చలు చేపట్టీ తనకు పవన్ ఎప్పుడు ప్రాణ స్నేహితుడే అంటూ క్లారిటీ ఇచ్చి ఆవివాదానికి కామా పెట్టాడు. తిరిగి ఇప్పుడు మళ్ళీ అలీ ఒక సొంత నిర్మాణ సంస్థను ‘అలీవుడ్’ పేరుతో ఏర్పాటు చేసి పవన్ కళ్యాణ్ తో ఒక సినిమాను నిర్మించ బోతున్నాడు అంటూ వస్తున్న వార్తలు ఇండస్ట్రీ వర్గాలను తెగ ఆశ్చర్య పరుస్తున్నాయి.


తెలుస్తున్న సమాచారం మేరకు ఈమధ్య విజయేంద్ర ప్రసాద్ పవన్ ను కలిసి ఒక పవర్ ఫుల్ స్టోరీ లైన్ చెప్పడం ఆకథకు పవన్ అంగీకారం లభించడం జరిగిపోయింది అన్నవార్తలు గుప్పుమంటున్నాయి. ఈ మూవీ ప్రాజెక్ట్ ను అలీ నిర్మిస్తాడని దర్శకుడు డాలీ దర్శకత్వం వహిస్తాడని ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి ఈవార్తల పై ఎటువంటి స్పష్టమైన క్లారిటీ లేకపోయినా ఈ న్యూస్ ఇండస్ట్రీ వర్గాలలో మాత్రమే కాకుండా పవన్ అభిమానుల మధ్య కూడ సంచలన వార్తగా మారింది.


దీనితో ఈవార్త నిజం కావాలని పవన్ అభిమానులు మనసారా కోరుకుంటున్నారు. రాజమౌళి సినిమాల విజయంలో విజయేంద్ర ప్రసాద్ కథ చాల కీలకంగా పనిచేస్తుంది. దీనితో విజయేంద్ర ప్రసాద్ కథ అంటేనే ఒక ప్రత్యేకమైన క్రేజ్. ఈక్రేజ్ ను తెలివిగా ఉపయోగించుకుని బడా నిర్మాతగా మారాలని అలీ ఒక ప్రయత్నం చేస్తున్నట్లు అనిపిస్తోంది. అయితే పవన్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాలతో పాటు ఇంకా హరీష్ శంకర్ సురేంద్ర రెడ్డి దర్శకత్వంలో నటించవలసిన సినిమాలు క్యూలో ఉన్నాయి. ఇన్ని సినిమాలు ఉండగా పవన్ తో అలీ సినిమాకు స్థానం ఎక్కడా అన్న సందేహాలు వచ్చినా గత రెండు రోజులుగా మీడియాలో హడావిడి చేస్తున్న ఈవార్త మటుకు పవన్ అభిమానులకు విపరీతమైన జోష్ ను కలిగిస్తోంది..

మరింత సమాచారం తెలుసుకోండి: