కరోనా నేపథ్యంలో.. లాక్ డౌన్ సమయంలో ఓటీటీల దూకుడు ఏ రేంజిలో పెరిగిందో అందరికీ తెలిసిందే. ఈ వేదికలకు కరోనా టైం బాగా కలిసొచ్చి ప్రేక్షకుల ఆదరణ లభించింది. క్రేజ్ కూడా ఊహించని విధంగా బాగా పెరిగింది. అయితే ఓటిటి లకు సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. తాజాగా ఓటిటి లకు సంబంధించి  కొత్త నిబంధనలను పెట్టింది కేంద్రం. ఈ మేరకు ఆయా వివరాలను మీడియా ముందు ప్రకటించారు కేంద్ర మంత్రులు shankar PRASAD' target='_blank' title='రవి శంకర్ ప్రసాద్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>రవి శంకర్ ప్రసాద్, ప్రకాశ్ జవదేకర్. ఓటిటి మరియు సోషల్ మీడియాలో నానా రచ్చ చేసే ఫేక్ న్యూస్ ల కట్టడికి కొత్త ప్రణాళికలను సిద్ధం చేసింది.

ఓటీటీ, డిజిటల్ ఫ్లాట్‌ఫాం లపై విడుదలయ్యే సినిమాలతో పాటు, సోషల్ మీడియాలో ఫాలో అయ్యే ఫేక్ న్యూస్ లకు అడ్డుకట్ట వేసేందుకు కొత్త గైడ్ లైన్స్ ను జారీ చేసింది. మొత్తం ఓటీటీ  కంటెంట్‌ను 5 కేటగిరీలుగా విభజించింది. అంటే యూనివర్సల్ U, ఈ సర్టిఫికెట్ ఉంటే అందరూ చూడొచ్చు . అన్ని వయస్సుల వారు చూసే యూనివర్సల్ వీడియోలు  U / A - జనరల్ వ్యూయింగ్..  ఏడేళ్ల లోపు చూసే వీడియోలు U / A13 -13 ఏళ్ల పైన వారు చూసే వీడియోలు, A 16+ పదహారు ఏళ్ల వారు చూసే పెద్ద వీడియోలు, పిల్లల కోసం- U/A - 7, A-  అంటే అడల్ట్ కేటగిరీలుగా విభజించింది.

అంతే కాదు అసభ్యకరమైన మరియు హింసాత్మకమైన వీడియోలపై నిషేధం ప్రకటించింది. ఇక నుంచి ఈ అంశానికి సంబంధించి పూర్తి నిఘా  ఉంటుందని పేర్కొంది. అంతే కాక గ్రీవెన్సీ కోసం రిటైర్డ్ జడ్జితో ఓ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. తద్వారా ఫేక్ న్యూస్ ల కట్టడికి ఆస్కారం ఉండనుంది. దీనితో ఇకపై ఫేక్ న్యూస్ పోస్ట్ చేసే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి మరి. ఎటువంటి ఫేక్ న్యూస్ అయినా సర్క్యూలేట్ చేస్తే అటువంటి వారిని చట్టం కఠినంగా శిక్షించనుంది.   

మరింత సమాచారం తెలుసుకోండి: