సినీ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అడుగుపెట్టి, ఎంతోమంది తమకంటూ మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటున్నారు.  ఇక ప్రస్తుతం ఎంతోమంది ఎన్నో సంవత్సరాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పని చేస్తున్నప్పటికీ, వారి వయసుకు, వారి అందానికి చాలా తేడా ఉంటుంది. ఇక అలాంటి వారిలో ఒకరు నటి శైలజా ప్రియ. ఈమె వయస్సు సుమారుగా ఉన్నప్పటికీ ఈమె చూడడానికి అచ్చం 20 ఏళ్ల అమ్మాయి లా కనిపిస్తుంది.. మీ వ్యక్తిగత విషయాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఆంధ్రప్రదేశ్ లోని బాపట్లలో 1978 మే 20 తేదీన జన్మించిన మామిళ్ల శైలజా ప్రియ, కేవలం తెలుగు సినిమాల్లోనే కాకుండా హిందీ,తమిళ చిత్రాల్లో కూడా నటిస్తూ, తనకంటూ  మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. 1998లో చిరంజీవి నటించిన మాస్టారు సినిమాలో మొట్టమొదటిసారిగా నటించిన శైలజా ప్రియ అంతకుముందు సీరియల్స్ లో నటించి, ప్రేక్షకులలో చెరగని ముద్ర వేసుకుంది. ఈమె వయసు దాదాపు 42 సంవత్సరాలు. కానీ ఈమె అందం మాత్రం 20 ఏళ్ల అమ్మాయి కి సరిపోతుంది. అంతలా తన అందంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తోంది..

ఇక ఈమె 2002వ సంవత్సరంలో ఎం.వి.ఎస్ కిషోర్ ని పెళ్లి చేసుకుంది. 2003వ సంవత్సరంలో ఒక బాలుడు కూడా జన్మించాడు.  ఇక ఇప్పటి వరకు దాదాపు 60 సినిమాలలో నటించింది. చిత్ర పరిశ్రమలోని ప్రముఖ హీరో హీరోయిన్లు అందరితోనూ కలిసి నటించింది. ఇక మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కించిన మాస్టారు,అన్నయ్య సినిమాలతోపాటు పవన్ కళ్యాణ్ నటించిన గోకులంలో సీత, నాగార్జునతో చంద్రలేఖ,ఢమరుకం, మహేష్ బాబుతో రాజకుమారుడు,వెంకటేష్ తో జయం మనదేరా.. ఇక అంతే కాకుండా సూర్యవంశం హిందీ లో అమితాబ్ బచ్చన్ సరసన కూడా కలిసి నటించింది.  అలాగే ప్రభాస్ మిర్చి లో కూడా రిచా గంగోపాధ్యాయ తల్లిగా నటించింది. అంతేకాకుండా ఇద్దరమ్మాయిలతో సినిమాలో కూడా కేథరిన్ కు తల్లిగా నటించింది.


అటు బుల్లితెరపై ఇటు వెండితెరపై మంచి.. మంచి..పాత్రలు పోషిస్తూ, తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది శైలజా ప్రియ. అంతే కాకుండా ఈమె బుల్లితెర స్టార్ సతీమణి గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: