సాధారణంగా సినీ ఇండస్ట్రీలో ఒక్కో హీరో కు ఒక్కో డైలాగ్ తో దర్శకులు  పాపులర్ చేస్తూ ఉంటారు. సాధారణంగా మనుషులిని చూసి ఆ హీరో ఎవరని గుర్తు పడతాము . కానీ డైలాగ్ వినగానే ఈ డైలాగ్ ఆ హీరో చెప్తాడు అని గుర్తుపట్టడం అంటే అది అతిశయోక్తి కాదు... అంతలా ఒక్క డైలాగ్ తో సినీ హీరోల కెరీర్ ని మార్చేస్తుంటాయి.. ఇదిలా ఉండగా కేవలం హీరోల కే పరిమితం కాని ఈ డైలాగులు, హీరోయిన్స్ లైఫ్ లో కూడా తన సినీ కెరీర్లో ఒక్క డైలాగ్ తో వారి కెరియర్ ని మార్చేశాయి..అయితే వాటి వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..


సినిమాల్లో హీరోయిన్ ల క్యారెక్టర్ ని ఒక్క డైలాగ్ తో హీరోయిన్ ల కోసం  మన రచయితలు రాసిన డైలాగ్ లు థియేటర్లలో బాగా పేలాయి.. అందులో ఒకటి జయం సినిమాలో "వెళ్లవయ్యా.. వెళ్ళు.. వెళ్ళు.." అనే డైలాగ్ సదా లైఫ్ లోకి స్టార్ డం ను తీసుకొచ్చింది  నేటికీ సదా ని ప్రేక్షకులు గుర్తు పెట్టుకున్నారు అంటే ఈ డైలాగ్ మహత్యం అని చెప్పవచ్చు.. ఇక రెజీనా సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమాలో "సీత తో.. అంత ఈజీ కాదు" అంటూ చెప్పే డైలాగ్ ప్రేక్షకుల మదిని దోచేసింది..

ఇక సాయి పల్లవి ఫిదా సినిమాలో "భానుమతి..ఒక్కటే పీస్..హైబ్రిడ్ పిల్ల" అనే డైలాగ్ ఇప్పటికి ప్రేక్షకుల్లో గుర్తుండిపోయింది.. ఇక తమన్నా హండ్రెడ్ పర్సెంట్ లవ్ సినిమాలో "దట్ ఇస్..మహాలక్ష్మి.." అంటూ చెప్పే డైలాగ్ ఇప్పటికే హైలెట్ గా నిలిచింది. ఇక ఛార్మి  శ్రీ ఆంజనేయం సినిమాలో "పద్దు.. శివంగి.. ఆడపులి.." అంటూ ప్రేక్షకులను పిచ్చెక్కించింది  . ఇక శ్వేతాబసుప్రసాద్ కొత్త బంగారు లోకం సినిమాలో "ఏక్క..డా..అని సాగదీసే  డైలాగ్ అప్పట్లో కాలేజీ అమ్మాయిల ను ఒక ఊపు ఊపింది . అంతేకాకుండా  ఈ డైలాగ్  అందరిని ఆకట్టుకుంది..

ఇక కాజల్ నటించిన సీత సినిమాలో "సీత..నేను గీసిందే గీత " అంటూ సినిమాలో కాజల్ చెప్పిన డైలాగ్ అందరినీ ఆకట్టుకుంది.. ఇక నభానటేష్ "సిరి..సాఫ్ట్ వేర్ ఇంజనీర్.." అంటూ నన్ను దోచుకుందువటే సినిమాలో తను చెప్పే డైలాగ్ తన క్యారెక్టర్ లోని అమాయకత్వాన్ని చూపించింది. రకుల్ ప్రీతి సింగ్ వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాలో తన పాత్రకి తగ్గట్లు "ప్రార్థన..ప్రతి రూపాయి కౌంట్ ఇక్కడ.." అంటూ హీరో మీద కౌంటర్లు వేసింది.. ఇక రష్మిక రీసెంట్ గా విడుదలైన సరిలేరు నీకెవ్వరు సినిమాలో "మీకు.. అర్థం అవుతుందా..? అంటూ రష్మిక  చేసిన రచ్చ మర్చిపోలేము..

మరింత సమాచారం తెలుసుకోండి: