ప్రభాస్ రెండు దశాబ్దాల క్రితం నాటి రెబెల్ స్టార్ క్రిష్ణంరాజు తమ్ముడు కొడుకుగా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చాడు. ఆ తరువాత తనను తాను ప్రూవ్ చేసుకుంటూ ఒక్కో మెట్టూ ఎక్కాడు. రాజమౌళి తీసిన చత్రపతి సినిమాతో ప్రభాస్ కి స్టార్ ఇమేజ్ వచ్చేసింది. ఆ తరువాత ప్రభాస్ అన్ని రకాల జానర్లతో సినిమాలు వరసగా చేస్తూ వెళ్ళాడు.

ఆ విధంగా టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరుగా ఉంటారు అని అంతా అంచనా వేశారు. అయితే రాజమౌళి బాహుబలి మాత్రం ప్రభాస్ దశను ఒక్కసారిగా మార్చేసింది అని చెప్పాలి. ఈ సినిమా రెండు భాగాలూ కూడా ప్రభాస్ కెరీర్ ని ఎంతో ఎత్తుకు తీసుకెళ్లాయి. ప్రభాస్ ని పాన్ ఇండియా స్టార్ ని చేశాయి. ఇపుడు బాలీవుడ్ లో ప్రభాస్ కి ఉన్న క్రేజే వేరు. తెలుగులో చతికిల పడిన సాహోకు బాలీవుడ్ జయహో అంటూ ఏకంగా 150 కోట్ల రూపాయల వసూళ్ళను రాబట్టేలా చేసింది.

ఇపుడు వరసగా ప్రభాస్ పాన్ ఇండియా మూవీస్ ని చేస్తున్నాడు. రాధేశ్యామ్, ఆది పురుష్, సలార్ తో పాటు నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో మరో సినిమా ప్రభాస్ ఖాతాలో ఉన్నాయి. ఇవన్నీ పక్కన పెడితే తాజాగా ఒక ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. అదేంటి అంటే ప్రభాస్ సినిమాకు ఎంత తీసుకుంటాడు అంటే ఇపుడున్న పాన్ ఇండియా ఇమేజ్ నేపధ్యంలో ఆయన చేస్తున్న సినిమాలకు ఒక్కో దానికీ వంద కోట్లకు తగ్గకుండా తీసుకుంటున్నాడుట. అంటే బాలీవుడ్ లో అక్షయకుమార్ కి చాలా దగ్గరలో ప్రభాస్ పారితోషికం ఉందని అంటున్నారు.

అక్కడ అక్షయ్ కుమార్ అయితే ఏకంగా 125 కోట్ల రూపాయలను  ఒక సినిమాకు తీసుకుంటాడు అని చెబుతారు. ఇక సౌతిండియాలో నిన్నటివరకూ రజనీకాంత్
వంటి సూపర్ స్టార్ల రెమ్యునరేషన్ ఎక్కువ అనుకునేవారు. కానీ ప్రభాస్ సినిమాకు వంద కోట్లు అని లెక్కలు బయటకు రావడంతో సౌతిండియాలో ప్రభాస్ కింగ్ అంటున్నారు. ఆ విధంగా ప్రభాస్ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశాడని కూడా అంటున్నారు. మరి ఈ రికార్డుని మళ్ళీ  ప్రభాస్ బద్దలు కొడతాడా మరెవరు అయినా వస్తారా అన్నది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: