‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ పై ఎదో ఒక సంచలన వార్త లేదంటే గాసిప్ రాయకుండా బాలీవుడ్ మీడియాకు రోజు గడవడం లేదు. ఈ సినిమాలో చరణ్ పక్కన సీత పాత్రలో నటిస్తున్న అలియా భట్ గత 10 రోజులుగా ‘ఆర్ ఆర్ ఆర్’ షూటింగ్ కు దూరంగా ఉండటం వెనుక ఒక ఆసక్తికర కారణం ఉంది అంటూ బాలీవుడ్ మీడియా సరికొత్త వార్తను సృష్టించింది.


అలియా యాక్టింగ్ స్కిల్స్ పై రాజమౌళి అసంతృప్తిగా ఉన్నాడని అందుచేతనే ఆమె పాత్రను ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీలో కుదించారు అంటూ ఒక గాసిప్పును ప్రచారంలోకి బాలీవుడ్ మీడియా తీసుకురావడంతో ఇప్పుడు దీనిపై ఇండస్ట్రీ వర్గాలలో అనేక ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. అయితే ఇండస్ట్రీ వర్గాల నుండి అందుతున్న సమాచారం మేరకు ఈ వార్త వివరాలు మరో విధంగా ఉన్నాయి.


మొదట్లో ‘ఆచార్య’ ప్రాజెక్ట్ అనుకున్నప్పుడు ఆమూవీలో చరణ్ పాత్ర కేవలం 30 నిముషాలు మాత్రమే ఉండే విధంగా డిజైన్ చేసారట. అయితే ఆతరువాత ఈ మూవీ కథలో వచ్చిన మార్పులతో చరణ్ పాత్ర 60 నిముషాలకు పెరిగిందని తెలుస్తోంది. దీనితో ప్రస్తుతం చరణ్ ‘ఆచార్య’ మూవీ షూటింగ్ లో బిజీగా ఉండటంతో అలియా భట్ చరణ్ లపై తీయవలసిన మరికొన్ని సన్నివేశాల షూటింగ్ ను వాయిదా వేసి అలియా భట్ ను పంపించివేసారు అని తెలుస్తోంది.


వాస్తవానికి రామ్ చరణ్ అలియా భట్ పై రెండు పాటలు షూట్ చేయాల్సి ఉందని వాటిని ఏప్రియల్ లో షూట్ చేస్తారని టాక్. ఈ పరిస్థితులు అన్నీ అలియాకు వివరించి తన డేట్స్ ను సద్దుబాటు చేయమని రాజమౌళి కోరడంతో ఆమె ఓకె చెప్పి ముంబాయ్ వెళ్ళిపోయింది అని అంటున్నారు. అసలు వాస్తవాలు తెలియక బాలీవుడ్ మీడియా ‘ఆర్ ఆర్ ఆర్’ పై ఈ నెగిటివ్ ప్రచారం చేస్తోంది అంటూ కొందరి అభిప్రాయం..


మరింత సమాచారం తెలుసుకోండి: