మద్యపానం ఆరోగ్యానికి హానికరం అంటూనే చాలామంది మద్యపానాన్ని తాగడం మానలేదు.. అంతేకాకుండా తాగి వాహనాలను  నడపకూడదు అనే ప్రభుత్వం విధించిన చట్టాలను సైతం ఉల్లంగించి మరీ చెలరేగిపోతున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో సామాన్యులే కాదు.. సెలబ్రిటీలు కూడా చాలామంది ఉన్నారు.. సాధారణంగా ఈ సమాజంలో మంచి గుర్తింపు ఉన్న వాళ్ళు ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్త వహించాలి.. కానీ చాలామంది దాన్ని పట్టించుకోక ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తూ ఉంటారు.. ఇలా ప్రవర్తించి, అందరి దృష్టిలోనూ చులకన అవుతున్నారు . అలాంటి వారిలో మన సెలబ్రిటీస్ కూడా ఉన్నారు.. వారెవరో ఇప్పుడు ఇక్కడ చూసి తెలుసుకుందాం..


నవదీప్:
విలక్షణ నటుడిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న నవదీప్, ఒకసారి అనుకోకుండా ఒక పార్టీకి  వెళ్లి వస్తున్న సమయంలో,పోలీసులకు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో దొరికాడు.. తాగి వాహనాన్ని నడిపినందుకు అతని  వాహనాన్ని స్వాధీనం చేసుకుని, జరిమానా వసూలు చేసి,కౌన్సిలింగ్ కూడా ఇచ్చారు..

 నిఖిల్ :
యూత్ లో మంచి క్రేజ్ ఉన్న యువ హీరో.. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో దొరికిపోయాడు. 2011లో అతన్ని ఒకసారి పోలీసులు పట్టుకున్నారు కూడా. ఆ తర్వాత పోలీసుల కౌన్సిలింగ్ ఇచ్చి ఒక రోజు రాత్రి అంతా పోలీస్ స్టేషన్ లోనే ఉంచారు. ఇక అప్పటి నుంచి చాలా జాగ్రత్త పడుతున్నాడు మన హీరో.

ప్రదీప్ మాచిరాజు:
బుల్లితెరపై ది బెస్ట్ యాంకర్ గా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకొని, ఇటీవల హీరోగా కూడా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ప్రదీప్ మాచిరాజు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఇరుక్కున్నాడు.

రాజా రవీంద్ర :
ఒకప్పుడు హీరోగా ఆ తరువాత  క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి పేరు తెచ్చుకున్న రాజా రవీంద్ర..డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో కోర్టుకు కూడా వెళ్ళాడు. ఆతర్వాత వివాదాలకు దూరంగా ఉంటూ వస్తున్నాడు..

 బి.వి.ఎస్.రవి:
ఒక మంచి దర్శకుడిగా పేరు ప్రఖ్యాతులు పొందిన బి.వి.ఎస్.రవి. డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిన ఆ తర్వాత అతను సాధారణ స్థితికి వచ్చి, సోషల్ మీడియాలో మద్యం గురించి అవగాహన కల్పిస్తున్నాడు.

 కోన వెంకట్ :
ప్రసిద్ధ రచయిత, నిర్మాత అయిన కోన,డ్రంక్ అండ్ డ్రైవ్ లో పోలీసులకు దొరికాడు. ఆ తర్వాత వాళ్లు కౌన్సిలింగ్ ఇచ్చినప్పటికీ తరచు వార్తల్లో ఉంటూ  వస్తున్నాడు.

 భరత్ :
రవితేజ సోదరులలో ఒక్కడైనా భరత్ ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో కనిపిస్తూనే ఉంటాడు. తెలుగు ఇండస్ట్రీలో డ్రగ్స్ తో పాటు ఆల్కహాల్ వంటి వ్యవహారాలలో అతని పేరు ఎక్కువగా వినిపిస్తుంది. పోలీసులు ఎన్ని సార్లు మందలిచ్చినప్పటికీ అతని బుద్ధి మాత్రం మార్చుకోవడం లేదు..

శివ బాలాజీ :
శివ బాలాజీ కూడా  2012 లో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో దొరికాడు. ఆ సమయంలో మీడియా పై ఫైర్ అయిన, మీడియా వేసే ప్రశ్నలకు ఇబ్బందిపడిన అతను అసహనం వ్యక్తం చేశాడు..

మరింత సమాచారం తెలుసుకోండి: