పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు యూత్ లో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదేమో. ఆయన పట్ల ఉన్న అభిమానాన్ని ఫ్యాన్స్ ఎప్పటికప్పుడూ వివిధ రకాలుగా తెలియజేస్తూనే ఉంటారు. ఇక పవర్ స్టార్ కు బయటే కాదు ఇండస్ట్రీలోనూ ఫ్యాన్స్ ఎక్కువగానే ఉన్నారు. అందులో యూత్ స్టార్ నితిన్ పవర్ స్టార్ ను ఎంతగా అభిమానిస్తారో అందరికీ తెలిసిన విషయమే. ఇక యూత్ స్టార్ నితిన్ నటించిన చిత్రాలకు పవన్ ప్రమోషన్ చేయడంతో పాటుగా నితిన్ హీరోగా నటించిన ‘ఛల్ మోషన్ రంగ’ సినిమాను కూడా పవన్ నిర్మించారు.
ఇకపోతే పవన్ పై ఉన్న అభిమానాన్ని మరోసారి బయటపెట్టకుండా ఉండలేకపోయాడు నితిన్. ఈ హీరో నటించిన‘చెక్’ సినిమా ఈ రోజు (ఫిబ్రవరి 26) విడుదలైంది. ఈ సందర్భంగా నితిన్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. అందులో యూత్ స్టార్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రస్తావించారు. తను నా లక్కీ ఛామ్ అంటూ పవన్ పై ఉన్న వీరాభిమానాన్ని తెలియజేశాడు నితిన్. ఇక మల్టీస్టారర్ సినిమాపై మీకు ఇంట్రెస్ట్ ఉందా అని అడగ్గా.. నితిన్ అవకాశం వస్తే నేను ఫస్ట్ తీసే మల్టీస్టారర్ మూవీ పవన్ కళ్యాణ్ గారితోనే అంటూ తన మనసులోని మాటలను బయటపెట్టాడు ఈ హీరో.

పవన్ కళ్యాణ్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడానికి ఎంతో వెయిట్ చేస్తున్నానని అన్నారు నితిన్. అలాగే నేను నటించిన ప్రతి సినిమాలో పవర్ స్టార్ ప్రస్తావన ఉంటుంది. కానీ చెక్ లో మాత్రం ఆ అవకాశం లేకుండా పోయింది. ఎందుకంటే ఈ సినిమా మొత్తం జైలులోనే నడుస్తుంది కాబట్టి .. జైలులో పవన్ కళ్యాణ్ ఫోటో పెడితే బాగోదని.. అందుకే ఈ సినిమాలో పవన్ ప్రస్తావన పెట్టలేదని నితిన్ తెలియజేశారు.  ఇక నితన్ ఈ సినిమా తర్వాత నటించే సినిమాల గురించి ప్రస్తావించారు. అంధాధున్ రీమేక్ కంప్లీట్ అయిన వెంటనే‘పవర్ పెట’ కోసం పనిచేస్తానని యూత్ స్టార్ నితిన్ తెలియజేశారు. కాగా నితిన్ పెళ్లి తర్వాతే వరుస సినిమా ఆఫర్లు దక్కించుకుంటూ ఫుల్ బిజీగా మారిపోయాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: