చిన్నప్పుడు టీ అమ్మిన వ్యక్తి దేశానికి ప్రధాని అయ్యారు.అతడి కథ ఏంటో మనకి తెలుసు. చెప్పులు కుట్టే వ్యక్తి దేశానికి ప్రెసిడెంట్ అయ్యారు. ఇతడి కథ కూడా తెలుసు. ఇప్పుడు ఇలాంటిదే ఒక ఛాయ్ వాలా కూతురు కథ గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం  దేశం యొక్క  త్రివిధ దళాలలో ఒకటైన వాయుసేనలో ప్రస్తుతం ఆమె పని చేస్తుంది. వివరాలలోకి వెళ్తే,

ఆమె పేరు అంచల్ గాంగ్వాల్. అంచల్ ఎయిర్ ఫోర్స్ ఫ్లైయింగ్ బ్రాంచ్ లో చేరి ఇప్పటికే రెండేళ్లు అవుతుంది. ఎవరికైనా త్రివిధ దళాలలో పనిచేయాలని ఉంటుంది. ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలం అవుతుంటారు. విఫలం అవగానే అంతటితో ఆపేస్తుంటారు. కానీ అంచల్ విఫలం అయినా ప్రయత్నాన్నిఆపలేదు. ఒకటి, రెండు, మూడు ఆలా అరవ ప్రయత్నంలో అంచల్ AFCAT (ఎయిర్  ఫోర్స్  కామన్  అడ్మిషన్  టెస్ట్) పరీక్ష రాసి విజయం సాధించింది. కాగా అంచల్ గత సంవత్సరం జూన్ లో ఎయిర్ ఫోర్స్ లో తన ట్రైనింగ్ ను విజయవంతంగా పూర్తి చేసుకుంది.అలాగే హైదరాబాద్ లో జరిగిన పరేడ్ లో పాల్గొని రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డును కూడా అందుకుంది.

ఇక అంచల్ కుటుంబం గురించి చూస్తే, అంచల్ మధ్యప్రదేశ్ కి చెందిన అమ్మాయి. వాళ్ళ తండ్రి ఒక టీ షాప్ ను నడుపుతూ ఉంటారు.అయితే అంచల్ చిన్నప్పటి నుండి డిఫెన్స్ లో చేరాలని కలలు కనేది. కానీ వారి కుటుంబ పరిస్థితుల కారణంగా అది నెరవేరేది కాదని భావించి చిన్నప్పటి నుంచి కష్టపడి చదివింది. ఆలా చదివి పోలీస్ ఉద్యోగాన్ని సాధించింది.ఆలా ఆ రాష్ట్ర పోలీస్ శాఖలో విధులు నిర్వర్తిస్తూ ఎయిర్ ఫోర్స్ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేది. ఆలా ఆరవ ప్రయత్నంలోనే తన కలని సాధించింది. ఆలా సాధించి ఆ రాష్ట్రంలోనే ఎయిర్ ఫోర్స్ లో చేరిన మొదటి అమ్మాయిగా పేరు కూడా సంపాదించింది.
చూసారు కదా అంచల్ గాంగ్వాల్ కథ. కలలు కనడం తప్పు కాదు ఆ కలలని సాధించడం కోసం కష్టపడకపోవడం తప్పు. అంచల్ తాను అనుకున్న దానికోసం కష్టపడింది చివరకు సాధించి చూపింది.ఇప్పుడు అంచల్ ఎయిర్ ఫోర్స్ ఫ్లైయింగ్ విభాగం లో విధులు నిర్వర్తించడం చూసి ఆమె తల్లి తండ్రులు తెగ ఆనందపడుతున్నారు. మొదట్లో ఎయిర్ ఫోర్స్ అంటే భయపడిన వారు అంచల్ సంకల్పం ముందు అవేవి పనిచేయలేదు. ఆమె పట్టుదల చూసి ఆమెను ప్రోత్సహించారు. ఆ విధంగా తల్లితండ్రుల ప్రోత్సాహంతో అంచల్ ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగం సాధించగలిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: