సినిమా ఇండస్ట్రీలో మన తారల మధ్య ప్రేమలు చాలా కామన్. అయితే ఆ ప్రేమలు చివరి వరకు కలిసి ఉండడం అనేది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది.. దాదాపు ఎక్కువ శాతం ప్రేమలు విఫలం అవుతూనే ఉంటాయి.. అయితే అలా విడిపోయిన ఒక హీరోయిన్ తన మాజీ ప్రియుడి ఫెయిల్యూర్ చూసి  ఆనందపడుతుంది అనే ప్రచారం టాలీవుడ్ వర్గాల్లో జోరుగా సాగుతోంది. నిజానికి ఈ అమ్మడు నటించిన సినిమా అలాగే ఆమె మాజీ ప్రియుడు నటించిన సినిమా ఒకే రోజు బాక్సాఫీస్ వద్ద పోటీ పడ్డాయి.


ఆసక్తికరంగా ఈ అమ్మడు నటించిన సినిమా సూపర్హిట్ టాక్ తెచ్చుకుని నడుస్తోంది. కానీ ఈ అమ్మడి మాజీ బాయ్ ఫ్రెండ్ నటించిన సినిమా మాత్రం ఏమాత్రం ఆకట్టుకోలేక పోయింది. ఇప్పటికే ఆయన సినిమాలు దాదాపుగా అన్ని వరుసగా ఫెయిల్ అవుతూ వస్తున్నాయి. ఈ సారి కచ్చితంగా హిట్ కొడతానని చేసిన ఈ సినిమా కూడా ఫెయిల్ కావడంతో ఆయన కాస్త డిప్రెషన్ లోకి వెళ్ళాడట. అయితే ఈ విషయం అంతా తెలిసి ఈ అమ్మడు కాస్త ఆనంద పడుతుందట. తనను ఇబ్బంది పెట్టినందుకు ఆమాత్రం జరిగినా ఫర్వాలేదు అన్నట్టు ఆమె సన్నిహితులతో వాపోతోంది అని అంటున్నారు.


 నిజానికి ఈ ఇద్దరూ ఒకప్పుడు పెళ్లి చేసుకుంటారు అని ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. ఇద్దరూ చాలా సందర్భాలలో చెట్టపట్టాలు వేసుకుని కనిపించడంతో ఇద్దరికీ దాదాపుగా పెళ్లి ఖాయం అని అనుకున్నారు అందరూ. కానీ ఏమైందో ఏమో ఎవరికి వాళ్లు తాము స్నేహితులు మాత్రమే అని స్టేట్మెంట్లు ఇచ్చి చాలా రోజుల నుంచి దూరం దూరంగానే ఉంటున్నారు. ఇక ఈ అమ్మడికి ఈ ఏడాదిలో ఈ సినిమా రెండో హిట్ అని అంటున్నారు. గతంలోనే ఒక సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న ఈ భామ ఈ సినిమాతో రెండో సక్సెస్ అందుకుంది అని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: