ఫిబ్రవరి 19వ తేదీన అనగా శుక్రవారం నాడు నాంది, చక్ర, పొగరు, కపటధారి సినిమాలు విడుదలయ్యాయి. అయితే వీటిలో కనీస వసూళ్లు కూడా రాబట్టలేక అతి పెద్ద డిజాస్టర్ గా కపటధారి సినిమా నిలిచింది. చాలా కాలం నుంచి ఒక హిట్ కొట్టాలని అక్కినేని సుమంత్ బాగా ప్రయత్నిస్తున్నారు. చివరికి కన్నడలో సూపర్ హిట్ అయిన కవులదారి మూవీ ని తెలుగులో రీమేక్ చేస్తే కచ్చితంగా హిట్ కొడతానని భావించారు. శాండిల్ వుడ్ లో కవులదారి గా వచ్చిన సినిమాని కోలీవుడ్ లో కూడా రీమేక్ చేశారు. అయితే తమిళనాట కూడా ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీనితో ఇక ఆలస్యం చేయకుండా ఈ సినిమాని తెలుగులో కపటధారి గా తెరకెక్కించారు. కానీ ఎవరూ ఊహించని విధంగా ఈ సినిమా భారీ డిజాస్టర్ కావడంతో సుమంత్ తో పాటు నిర్మాతలు లబోదిబోమంటున్నారు.

మంచి కథాబలం ఉన్న ఈ సినిమాని వేరొక హీరోతో తెరకెక్కించి ఉంటే సూపర్ హిట్ అయ్యి ఉండేదని దర్శక నిర్మాతలు గుసగుసలాడుతున్నారట. నిజానికి ఈ సినిమాని సీనియర్ హీరో రాజశేఖర్ తో కలిసి తెరకెక్కించాలని భావించారు. ఆయనను హీరోగా అనుకొని పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించారు. కానీ ఏవో అంతర్గత విభేదాల కారణంగా హీరో రాజశేఖర్సినిమా నుంచి తప్పుకున్నారు. దీంతో సుమంత్ కి కపటధారి మూవీలో నటించే అవకాశం వచ్చింది.

ఐతే ఈ సినిమా ఇతర భాషల్లో మంచి హిట్ అవడంతో మరో ఆలోచన లేకుండా హీరోగా నటించడానికి ఆయన ఒప్పుకున్నారు. ఈ సారి తనకు ఖచ్చితంగా హిట్ దక్కుతుందని బాగా నమ్మారు. కానీ నాలుగు సినిమాలు ఒకేసారి విడుదలైన సమయంలోనే కపటధారి తెరకెక్కడం తో కనీస వసూళ్లు కూడా రాబట్టలేక చతికిలబడి పోయింది. సినిమా డిజాస్టర్ కావడానికి మరో కారణం కూడా ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు. అదేంటంటే డిజాస్టర్ కా బాప్ గా పేరు తెచ్చుకున్న అక్కినేని సుమంత్ సినిమాలను ప్రేక్షకులు చూడటం ఎప్పుడో మానేశారట. ఒకవేళ మొదటగా అనుకున్న హీరో రాజశేఖర్ తోనే సినిమా నటించినట్లయితే హిట్ అయి ఉండేదేమో. ఏది ఏమైనా ఈ డిజాస్టర్ తో సుమంత్ సినిమా కెరీర్ ముగిసినట్లేనని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: