ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... టాలీవుడ్ యంగ్ హీరో అల్లరి నరేష్ ఎన్నో ప్లాపుల తరువాత నటించిన తాజా చిత్రం 'నాంది'. మంచి టాక్ తో సక్సెస్ ఫుల్ గా ప్రదర్శింపబడుతోంది. థియేటర్ లలో డీసెంట్ రన్ ను కొనసాగిస్తుంది. ఫిబ్రవరి 19న విడుదలైన ఈ చిత్రం నరేష్ కు మంచి విజయాన్ని అందించింది. 9 ఏళ్లుగా వరుస ప్లాపులతో సతమత మవుతూ సరైన హిట్టుకోసం ఎదురుచూస్తున్న నరేష్ కు ఈ చిత్రం మంచి కం బ్యాక్ హిట్ ఇచ్చి ఆ లోటుని తీర్చి.. అతని ప్లాపులకు బ్రేక్ వేసింది.కొత్త దర్శకుడు విజయ్ కనకమేడల డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని 'ఎస్.వి.2 ఎంటర్టైన్మెంట్' బ్యానర్ పై ప్రముఖ దర్శకుడు సతీష్ వేగేశ్న నిర్మించాడు. ఇప్పటివరకూ కామెడీ హీరోగానే రాణిస్తూ వచ్చిన నరేష్.. ఈసారి కంప్లీట్ సీరియస్ రోల్ ప్లే చేసిన చిత్రమిది. నేను, గమ్యం, మహర్షి తరువాత ఈ సినిమాలో నటన పరంగా ఆకట్టుకున్నాడు అల్లరి నరేష్....

ఇక ఈ సినిమా విడుదల అయ్యి వారం పూర్తి చేసుకుంది. ఇక ఈ సినిమా మొదటి వారం వసూళ్ల విషయానికి వస్తే...'నాంది' చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా రూ.2.7కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. కాబట్టి ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.3.2కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 6 రోజులకే ఆ టార్గెట్ ను పూర్తిచేసింది ఈ చిత్రం.ఇక మొదటివారం పూర్తయ్యేసరికి 3.47 కోట్ల షేర్ ను రాబట్టి డీసెంట్ రన్ కొనసాగిస్తుంది.మొత్తానికి అల్లరి నరేష్ కి చాలా కాలం తరువాత ఈ సినిమాతో మంచి హిట్ తో పాటు మంచి పేరు కూడా వచ్చింది... ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన మూవీ అప్ డేట్స్ ఇంకా కలెక్షన్ల విషయాలు తెలుసుకోడానికి ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో ఆసక్తికరమైన విషయాలు గురించి తెలుసుకోండి....

మరింత సమాచారం తెలుసుకోండి: