దర్శక ధీరుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ‘బాహుబలి’ సినిమా ఏ రేంజ్ లో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదేమో. ఈ సినిమాలోని ప్రతి అంశం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ముఖ్యంగా ఇందులో ప్రభాస్ సాహసాలు.. ఫైటింగ్స్ అయితే.. ప్రేక్షకులను కనురెప్పవాల్చకుండా చేశాయి. అయితే ఈ బాహుబలి మూవీ ఫైటింగ్స్ కోసం రెబల్ స్టార్ ప్రభాస్, రానా దగ్గుపాటితో పాటుగా ఆ చిత్ర యూనిట్ కూడా కొన్ని నెలలు మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ పొందారు. ఈ వీరి శిక్షణ జకన్న పర్యవేక్షణలోనే జరిగింది. ఈ శిక్షణలో భాగంగా బాహుబలి టీం అంతా కఠోరంగా శ్రమించారు.
ఇక ఈ సినిమాతోనే కొందరు ఇలాంటి వర్కౌట్స్ కు, క్రమశిక్షణకు స్వస్తి చెబితే.. రానా దగ్గుపాటి మాత్రం అప్పటి క్రమ శిక్షణనే నేటికీ కొనసాగిస్తున్నాడు. ఇప్పుడు బాహుబలి శిక్షణకు మించి అన్న తీరుగా మెగా కుర్ర హీరో వరుణ్ తేజ్ ఓ రేంజ్ లో కష్టపడుతున్నాడు. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ‘ఘని’ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటి నుంచి వరుణ్ తేజ్ జిమ్ లకే అంకితమయ్యాడంటే నమ్మండి. డైట్ ను మెయిన్ టెయిన్ చేస్తూ.. జిమ్ లో గడిపేస్తూ ఈ హీరో బాడీని మార్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటికే వరుణ్ తేజ్ బాడీ లుక్ చాలా మారింది. ఇప్పడు ఈ హీరో రియల్ టైం బాక్సర్ గా కనిపిస్తున్నారు.

అయినా ఇది సరిపోదన్నట్టే కోచ్ సమక్షంలో ఉండి మరి ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారు వరుణ్. తాజాగా వరుణ్ తేజ్ తీసుకుంటున్న శిక్షణకు సంబంధించిన  ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఈ ఫోటోను భారతీయ బాక్సర్ నీరజ్ గోయత్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘ఘని’ లో వరుణ్ తేజ్ ఏ విధంగా కనిపించాలనుకుంటున్నాడో ఈ పిక్ ను చూస్తేనే అర్థమవుతోంది. సినిమా కోసం అహర్నిశలు కఠోర శిక్షణ తీసుకుంటూ వరుణ్ తేజ్ రియల్ బాక్సర్ లా మారిపోయాడు. ఇప్పటికే ఘని పోస్టర్ అందరినీ తెగ ఆకర్షించింది.  ఇక మిగిలింది బాక్సర్ లా వరుణ్ తేజ్ ప్రేక్షకుల ముందుకు రావడమే. ఎన్నో అంచనాలతో ఈ సినిమా జులై 30 న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: