తెలుగు చిత్ర పరిశ్రమ లో అక్కినేని సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు . ఆమె నటన తో కోట్లాది మంది అభిమానుల ను సంపాదించుకుంది ఈ భామ. ఏమాయ చేసావే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమ లో తెరంగ్రేటం చేసింది సమంత . తర్వాత వరుస అవకాశాల ను సద్వినియోగం చేసుకుంటూ స్టార్ హీరోయిన్ రేంజ్ ఎదిగింది  ఈ భామ. ఇక నాగచైతన్యని పెళ్లి చేసుకొని అక్కినేని కోడలు అయ్యింది.

యాదృచ్ఛికమో అక్కినేని కుంటుంబం మొత్తం కలిసి నటించిన ‘మనం’ సినిమాలో ప్రియగా నటించింది. మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ‘మహానటి’లో జర్నలిస్ట్ మధురవాణిగా.. ఆ తర్వాత  సుకుమార్, రామ్ చరణ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘రంగస్థలం’లో పల్లెటూరి యువతి రామలక్ష్మి పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందే. సమంత నట జీవితంలో ఈ క్యారెక్టర్ మేలిమలుపు అనే  చెప్పాలి. ఆ తర్వాత తన భర్త నాగ చైతన్యతో చేసిన ‘మజిలీ’లో సామాన్య గృహిణిగా మెప్పించింది. ఆ తర్వాత ‘ఓ బేబి’ సినిమాలో ముసలావిడ పాత్రలో నటిస్తూనే చిలిపితనం ఒలకబోసింది.

అయితే నేడు సమంత హీరోయిన్‌గా పదకొండేళ్లు పూర్తి చేసుకుంది.  నటిగా 12వ వసంతంలోకి అడుగుపెట్టింది. గతేడాది సమంత.. కరోనా సమయంలోనే ‘ఫ్యామిలీ మెన్ 2’ వెబ్ సిరీస్‌లో విలన్‌ పాత్రలో నటించింది. త్వరలో ఈ వెబ్ సిరీస్‌లో స్ట్రీమింగ్ కానుంది. మరోవైపు ‘ఆహా’ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో సామ్ జామ్ అంటూ సందడి చేసింది. త్వరలో గుణశేఖర్ దర్శకత్వంలో ‘శాకుంతలం’ సినిమాతో పలకరించబోతుంది. సమంత తన కెరీర్‌లో చేస్తోన్న తొలి పౌరాణిక సినిమా ఇదే. ఈ సినిమా దుష్యంతుడి పాత్రలో ఎన్టీఆర్ పేరు వినిపిస్తోంది. ప్యాన్ ఇండియా మూవీగా ఈ సినిమా తెరకెక్కనుంది. మొత్తంగా పెళ్లి తర్వాత కూడా సమంత కెరీర్ మూడు హిట్లు.. ఆరు ఆఫర్లు అన్నట్టుగా సాగిపోతూనే ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: