నాచురల్ స్టార్ నాని నటించిన సూపర్ హిట్ సినిమాల ల్లో జెర్సీ సినిమా ఒకటి . నానిలోని కొత్త టాలెంట్ ని ప్రేక్షకులకు చూపించిన ఒక గొప్ప సినిమా ఇది . 2019 లో గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అందరి  ప్రశంసలను  అందుకుంది . ఈ సినిమాలో నాని పోషించిన అర్జున్ పాత్ర ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. ఈ సినిమాలో అర్జున్ పాత్రను చుస్తే మనకు హార్ట్ టచింగ్ గా ఉంటుంది. ఈ సినిమాలో నాని పాత్ర ఎంత హైలెట్ అయిందో నాని కొడుకుగా నటించిన చిన్న పిల్లాడి పాత్ర కూడా అంతే హైలెట్ అని అయిందని చెప్పాలి.

తండ్రి కొడుకుల మధ్య వచ్చే సీన్స్ ఆద్యంతం ప్రేక్షకులను కట్టి పడేస్తాయి. నాని కొడుకు పాత్ర లో నటించిన అబ్బాయి పేరు రోనిత్ కామ్రా . రోనిత్ కామ్రా ఢిల్లీకి చెందిన వాడు . రోనిత్  జెర్సీ సినిమాలో నటించక ముందు ఫ్యాబ్ ఇండియా, హార్లిక్స్, టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్, టప్పర్ వేర్  అని
ఇంకా ఎన్నో యాడ్స్ లో నటించాడు. రోనిత్ తల్లి పేరు సోనియా కామ్రా. తండ్రి పేరు విపిన్ కామ్రా. వీరిది ఒక  పంజాబీ కుటుంబం .


అంత చిన్న వయసులో  జెర్సీ సినిమా లో  ఎంతో బాగా నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు రోనిత్.జెర్సీ సినిమా ఇప్పుడు హిందీలో రూపొందుతోంది . ఇందు లో హీరోగా షాహిద్ కపూర్, హీరోయిన్ గా మృణాల్ ఠాకూర్ నటిస్తున్నారు. అందులో షాహిద్ కపూర్ తోపాటు రోనిత్ కూడా బైక్ మీద కూర్చుని ఉన్నాడు . అంటే హిందీలో కూడా రోనిత్ నటిస్తున్నట్లు అర్ధం అవుతుంది . అలాగే తెలుగులో " రంగ్ దే "సినిమా లో కూడా నటిస్తున్నాడు ఈ మాస్టర్ రోనిత్ .

మరింత సమాచారం తెలుసుకోండి: