ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి....సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా నిలదొక్కుకోవాలంటే మంచి మార్కెట్ సంపాదించుకోవాలి. అది ఒకప్పుడు అలానే మన స్టార్స్ రాణించారు. కాని ఇప్పుడు అలా కాదు. ఫార్ములా అంత చేంజ్ అయింది..మార్కెట్ బార్డర్స్ని ఇప్పుడు చాలా మంది లెక్క చేయడం లేదు. సినిమా కంటెంట్ బావుంటే జనాలు తప్పకుండా థియేటర్స్ కు వస్తారని ఒక నమ్మకంతో వెళుతున్నారు. అయితే అందులో కొన్ని సినిమాలే మార్కెట్ వద్ద క్లిక్కవుతున్నాయి.అలా క్లిక్ అయ్యి చాలా మంది పెద్ద స్టార్ హీరోస్ అయ్యారు.ఇక మంచు విష్ణు ఎలాంటి నమ్మకంతో నిర్మించాడో ఏమో గాని మోసగాళ్ళు సినిమాకు బడ్జెట్ గట్టిగానే పెట్టారట.


 ముందు నుంచి కూడా ఈ సినిమా బడ్జెట్ పై అనేక రకాల కథనాలు వచ్చాయి.ఇక ఇప్పుడు డైరెక్ట్ గా మంచు విష్ణు బడ్జెట్ పై ఒక క్లారిటీ ఇచ్చాడు. గురువారం ట్రైలర్ ను లాంచ్ చేస్తూ సినిమా విశేషాల గురించి మాట్లాడారు. ఈ సినిమాను చాలా వరకు హాలీవుడ్ టెక్నీషియన్స్ తో తెరకెక్కించినట్లు చెబుతూ బడ్జెట్ రిస్క్ అని తెలిసినా కూడా కాన్సెప్ట్ బేస్డ్ మూవీ కావడంతో రిస్క్ చేసి కేవలం కథపై నమ్మకంతో ఎక్కువ బడ్జెట్ పెట్టారట...


ఇక మంచు విష్ణు మాట్లాడుతూ...."సినిమా కాన్సెప్ట్ రెడీ అయినప్పుడు బడ్జెట్ నా మార్కెట్ కంటే 30% ఎక్కువ అవుతుందని అర్ధమయ్యింది.నా కెరీర్ లో ఇదే హయ్యెస్ట్ బడ్జెట్ మూవీ. అంత మార్కెట్ నాకు లేదని తెలుసు. అలాగే రిస్క్ అని కూడా అనుకున్నాను. అయితే మోసగాళ్ళు ఆ మార్కెట్ పరిధిని పెంచుతుందని అనుకుంటున్నాను."అని ఓపెన్ గా చెప్పేశాడు. నిజానికి ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనా లాక్ డౌన్ వల్ల వాయిదా పడింది. ఇక మంచు విష్ణు చేసిన ఈ రిస్క్ కి ఈ సినిమా ఎలాంటి ఫలితం అందిస్తుందో చూడాలి. ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి....

మరింత సమాచారం తెలుసుకోండి: