టాలీవుడ్‌లో సీక్వెల్స్‌ కౌంట్‌ పెరిగిపోతోంది. రోజుకో సినిమాకి సీక్వెల్ అనౌన్స్‌ చేస్తున్నారు దర్శకనిర్మాతలు. పది, ఇరవై ఏళ్ల కిత్రం తీసిన సినిమాలని కూడా ఇప్పుడు సీక్వెల్స్‌లోకి తీసుకొస్తున్నారు. దీంతో టాలీవుడ్‌లో ఎప్పుడూ లేనంతగా ఈ ఏడాది అరడజనుకిపైగా సీక్వెల్స్‌ వస్తున్నాయి.

నితిన్‌కి 'సై' తర్వాత 8 ఏళ్లు సరైన హిట్‌లేదు. మాస్‌ యాక్షన్‌ స్టోరీస్‌తో నితిన్ కెరీర్‌ ముగిసిసోతోందనే కామెంట్స్‌ కూడా వచ్చాయి. సరిగ్గా ఈ టైమ్‌లోనే విక్రమ్‌ కుమార్ ఎంట్రీ ఇచ్చాడు‌. లవ్‌ ఎంటర్‌టైనర్ 'ఇష్క్'తో నితిన్‌ని సక్సెస్‌ ట్రాక్‌ ఎక్కించాడు. ఇక ఈ సినిమా ఏళ్లు 9 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా, విక్రమ్ కుమార్‌ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు. మళ్లీ కలిసి పనిచేయబోతున్నాం అని నితిన్, పీసీ శ్రీరామ్‌తో కలిసున్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో 'ఇష్క్' సీక్వెల్‌ వస్తుందనే ప్రచారం మొదలైంది.


వెంకటేశ్‌ ఈ ఏడాది రెండు సీక్వెల్స్‌ రెడీ చేస్తున్నాడు. ఫ్యామిలీ ఫ్రస్ట్రేషన్‌తో ఒక సినిమా, ఫ్యామిలీని కాపాడుకునే రెస్పాన్సిబుల్ ఫ్యామిలీమెన్‌ కాన్సెప్ట్‌తో మరో సినిమాకి సీక్వెల్‌ చేస్తున్నాడు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వరుణ్‌తేజ్‌తో కలిసి చేసిన కామిక్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'ఎఫ్-2'కి సీక్వెల్ చేస్తున్నాడు వెంకీ. 'ఎఫ్3' పేరుతో రూపొందుతోన్న ఈ సినిమా ఆగస్ట్ 27న రిలీజ్ కాబోతోంది.

వెంకటేశ్ 'దృశ్యం' సీక్వెల్‌ కూడా స్టార్ట్ చేస్తున్నాడు. 'ఎఫ్3' సెట్స్‌లో ఉండగానే 'దృశ్యం2' అనౌన్స్‌ చేశాడు వెంకీ. ఇక ఈ మూవీ మార్చిలో మొదలై 'ఎఫ్-3' కంటే ముందే జూన్, జులైలోనే రిలీజ్ అవుతుందని చెప్తున్నారు. ఈ సీక్వెల్‌తోనే మళయాళీ దర్శకుడు 'దృశ్యం' ఓనర్ జీతూ జోసెఫ్ టాలీవుడ్‌కి ఎంట్రీ ఇస్తున్నాడు.

తెలుగునాట సీక్వెల్స్‌ పెద్దగా హిట్‌ కావనే సెంటిమెంట్ ఉంది. అందుకే చాలామంది డైరెక్టర్లు సీక్వెల్స్‌ గురించి ఆలోచించరు. కానీ కొంతమంది దర్శకులు మాత్రం ఫ్లాపుల నుంచి బయటపడేందుకు సీక్వెల్స్‌నే నమ్ముకున్నారు. సీక్వెల్ సెంటిమెంట్‌ని బ్రేక్ చేసేందుకు ఫుల్‌ ప్రిపేర్డ్‌గా బరిలో దిగుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: