హీరోలు మాత్రమే కాదు, నిర్మాతలు కూడా బాలీవుడ్‌ని ఫోకస్ చేస్తున్నారు. నార్త్ మార్కెట్‌లో సూపర్‌హిట్స్‌ కొట్టడానికి బయల్దేరుతున్నారు. కొంతమంది ప్రొడ్యూసర్లు రీమేక్ సినిమాలతో బాలీవుడ్‌కి వెళ్తోంటే, మరికొంతమంది పాన్ ఇండియన్‌ ప్రాజెక్ట్స్‌తో హిందీకి వెళ్తున్నారు. దీంతో హిందీలో తెలుగు డామినేషన్‌ మొదలైందనే మాటలు ఎక్కువయ్యాయి.

తెలుగులో ఉన్న హిట్‌ రాజు ఇమేజ్‌ని బాలీవుడ్‌లోనూ కంటిన్యూ చేయాలనుకుంటున్నాడు దిల్‌ రాజు. బోనీ కపూర్, అల్లు అరవింద్‌తో కలిసి హిందీలో వరుస సినిమాలు ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఇప్పటికే అల్లు అరవింద్‌తో కలిసి 'జెర్సీ' రీమేక్‌ చేస్తున్నాడు దిల్‌ రాజు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో షాహిద్‌ కపూర్‌ హీరోగా తెరకెక్కుతోంది హిందీ 'జెర్సీ'.

దిల్‌ రాజు హిందీలో మరో రెండు సినిమాలు కూడా తీస్తున్నాడు. బోనీ కపూర్‌తో కలిసి 'ఎఫ్2' సినిమాని రీమేక్ చేయబోతున్నాడు. ఈ హిందీ 'ఎఫ్2'లో అర్జున్‌ కపూర్ ఒక హీరోగా నటిస్తాడని తెలుస్తోంది. అలాగే ఇప్పుడు అల్లరి నరేష్ 'నాంది' సినిమాని కూడా హిందీలో రీమేక్ చేస్తాడని ప్రచారం జరుగుతోంది.

దిల్‌ రాజ్ రీసెంట్‌గానే శంకర్‌, రామ్ చరణ్ కాంబినేషన్‌లో ఒక సినిమా అనౌన్స్‌ చేశాడు. ఈ మూవీ కూడా పాన్‌ ఇండియన్‌ ప్రాజెక్ట్‌గానే రూపొందుతోంది. ఈ మూవీని తెలుగు, తమిళ్‌తో పాటు హిందీలో కూడా లార్జ్‌ స్కేల్‌లో రిలీజ్ చేస్తారని చెప్తున్నారు. అందుకే బాలీవుడ్‌ ఫార్మాట్‌లోనే మల్టిపుల్ మ్యూజిక్ డైరెక్టర్స్‌ని తీసుకుంటున్నారట. అనిరుధ్‌తో పాటు దేవి శ్రీ ప్రసాద్, తమన్‌ లాంటి వాళ్లతో కూడా సంప్రదింపులు జరుపుతున్నారని సమాచారం.

తెలుగు సినిమా బౌండరీస్‌ క్రాస్ చేసి చాలాకాలమైంది. యూనివర్సల్‌ స్టోరీస్‌తో ఇతర మార్కెట్స్‌కి వెళ్తున్నారు. పైగా లార్జ్‌ స్కేల్ సినిమాలు అనగానే బడ్జెట్‌ కూడా వంద, రెండు వందల కోట్లు అవుతోంది. అందుకే బడ్జెట్‌ రికవరీ చెయ్యడానికి పక్క మార్కెట్స్‌కి వెళ్తున్నారు.

తెలుగులో భారీ సినిమాలు తీస్తోన్న మైత్రీ మూవీ మేకర్స్ కూడా బాలీవుడ్‌ని ఫోకస్ చేసింది. హిందీ డైరెక్టర్ సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వంలో ప్రభాస్‌తో ఒక యాక్షన్‌ ఎంటర్‌టైనర్ తియ్యబోతున్నారట మైత్రీ మేకర్స్. ఇప్పటికే డిస్కషన్స్‌ పూర్తయ్యాయని త్వరలోనే అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశముందని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: