ప్రస్తుతం స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్.. సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న‘పుష్ప’ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా.. 180 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందించడానికి సుకుమార్ ప్లాన్ వేశాడు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో స్టైలీష్ స్టార్ సరసన లక్కీ బ్యూటీ రష్మిక మందాన కథానాయికగా నటిస్తున్న సంగతి తెలీసిందే. ఈ ఇద్దరి కాంబోలో తెరకెక్కుతున్న ఈ మూవీ బన్నికి తొలి పాన్ ఇండియా మూవీ కూడా కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఏర్పడ్డాయి.
తాజా సమాచారం మేరకు ఈ సినిమాలో అల్లు అర్జున్, రష్మిక రోల్స్ ఓ రేంజ్ లో ఉంటాయని వార్తలు వస్తున్నాయి. వీరి పాత్రలను ఇంతకు ముందు ఎప్పుడూ చూడని విధంగా ప్లాన్ చేశారట డైరెక్టర్ సుకుమార్. ఇందులో బన్ని లుక్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో బన్ని లుక్ ఏవిధంగా ఉంటుందో ఈ మూవీ నుంచి వచ్చిన పిక్స్ చూస్తేనే అర్థమవుతోంది. మాసిన జుట్టుతో, రఫ్ అండ్ ఫుల్ మాస్ లుక్ తో బన్ని కనిపిస్తున్నారు. ఈ పిక్స్ తోనే బన్ని ‘పుష్ప’ పై ప్రేక్షకులకు భారీ అంచనాలు ఏర్పడేలా చేశారు. ఇక తాజాగా ఇందులో రష్మిక రోల్ కు సంబంధించిన వివరాలు కూడా లీక్ చేశారు లీక్ రాయుళ్లు.
పుష్ప మూవీ ఆన్ లొకేషన్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. అయితే ఇందులో రష్మిక మరీ డీ గ్లామర్ గా కనిపించకుండా.. ఓ మిడిల్ క్లాస్ యువతిలా మెరిసిపోతోంది. ఇలాంటి యువతిని ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే వారితో సుకుమార్ ఎలా సింక్ చేయనున్నాడనే పాయింట్ ఆసక్తి కలిగిస్తోంది. ఇక ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ వారు నిర్మిస్తున్నారు. అదిరి పోయే మ్యూజిక్ అందించబోతున్నారు దేవి శ్రీ ప్రసాద్.   

మరింత సమాచారం తెలుసుకోండి: