విక్రమ్‌కి విజయాన్ని నిలుపుకోవడమే కాదు, సినిమాని కాపాడుకోవడం కూడా కష్టమైపోతోంది. సెట్స్‌కి వెళ్లిన సినిమాలు కూడా విక్రమ్ ఖాతా నుంచి వెనక్కి వెళ్లిపోతున్నాయి. లార్జ్‌ స్కేల్ మూవీ 'సూర్యపుత్ర మహావీర కర్ణ' నుంచి విక్రమ్‌ని తీసేశారు నిర్మాతలు. మరి ఈ పాన్ ఇండియన్‌ మూవీ నుంచి విక్రమ్‌ని తీసెయ్యడానికి కారణమేంటనే సందేహాలు తలెత్తుతున్నాయి.

'సూర్యపుత్ర మహావీర కర్ణ' సినిమాని పాన్‌ ఇండియన్‌ ఫిల్మ్‌గా ప్లాన్ చేశారు నిర్మాతలు. అందుకే తెలుగు, తమిళ్‌తో పాటు హిందీలోనూ గుర్తింపు ఉన్న విక్రమ్‌ని హీరోగా తీసుకున్నారు. ఈ స్టార్‌ కూడా వార్ ఫిల్మ్‌తో మళ్లీ ట్రాక్ ఎక్కొచ్చని ఆశ పడ్డాడు. ఎంతో ఉత్సాహంగా షూటింగ్‌లో కూడా జాయిన్ అయ్యాడు. కానీ ఇప్పుడు సడన్‌గా విక్రమ్‌ని తప్పించి, కొత్తగా మరో అనౌన్స్‌మెంట్ వీడియో రిలీజ్‌ చేశారు నిర్మాతలు.

విక్రమ్‌ ఒక్క హిట్‌ చూసి చాలా కాలమైంది. 2005లో వచ్చిన 'అపరిచితుడు' తర్వాత విక్రమ్‌కి మళ్లీ ఆ రేంజ్‌ హిట్ రాలేదు. 16 ఏళ్లుగా ఫ్లాపుల్లోనే ఉన్నాడు. దీంతో ఈ హీరో మార్కెట్‌ మొత్తం పడిపోయింది. తమిళ్, తెలుగు రెండిటిలో చిన్న హీరో స్థాయికి పడిపోయాడు విక్రమ్. అందుకే 'మహావీరకర్ణ' నుంచి విక్రమ్‌ని తప్పించారట  నిర్మాతలు.

విక్రమ్‌కి సౌత్‌లోనే సరైన మార్కెట్‌ లేదు. ఇక నార్త్‌కి ఏం ప్లస్‌ అవుతాడు అనుకుంటున్నారట నిర్మాతలు. అందుకే 'సూర్యపుత్ర మహావీర కర్ణ' సినిమా నుంచి విక్రమ్‌ని తప్పించారని తెలుస్తోంది. ఇక టైటిల్‌ రోల్‌కి బాలీవుడ్‌ స్టార్‌ని తీసుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది. మరి కర్ణుడి పాత్ర పోషించే హిందీ స్టార్ ఎవరనేది చూడాలి. మొత్తానికి సూర్యపుత్ర మహావీర కర్ణ నుంచి విక్రమ్ తొలగిపోయారు. షూటింగ్ స్టార్ట్ చేశాక ఆయన్ను తప్పించడం అభిమానుల్లో కొంత అసహనానికి గురి చేసింది. అయితే విక్రమ్ ప్లేస్ లో బాలీవుడ్ నటుడిని తీసుకునే ప్రయత్నంలో ఉన్నారు దర్శక నిర్మాతలు. చూద్దాం.. ముందు ముందు ఏం జరుగుతుందో.






మరింత సమాచారం తెలుసుకోండి: