టాలీవుడ్ లో కొత్త హీరోయిన్ లకు కొదువలేదు.. కొంచెం టాలెంట్ తో పాటు గ్లామర్ కూడా ఉంటే ఆమెకు వరుస అవకాశాలు వస్తుంటాయి.. ఆవగింజంత అదృష్టం ఉంటే ఆమె స్టార్ హీరోయిన్ అవడం పక్కా.. చాలామంది హీరోయిన్ లు ఇక్కడ అవకాశాలు అందిపుచ్చుకుని పెద్ద రేంజ్ కి వెళ్లి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుని ఏవో కారణాల వల్ల మధ్యలోనే  కెరీర్ ను వదిలేశారు.. అలాంటి హీరోయిన్ లలో ఒకరు రెజీనా కసాండ్రా.. టాలీవుడ్ లో కొన్ని సినిమాల్లో నటించి రెజీనా ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది.. అయితే టాప్ హీరోయిన్ గా మాత్రం కాలేకపోయింది.

యంగ్ హీరోలతో నటించిన పెద్ద హీరోలతో సినిమా చేయడంలో ఎందుకో ఆమె సక్సెస్ కాలేదు. దాంతో కొన్ని రోజుల్లోనే ఆమె కెరీర్ తెలుగులో పూర్తయిపోయింది.. సుధీర్ బాబు SMS తో తెలుగు ప్రేక్షకులను పరిచయమైనా రెజీనా ఆ తర్వాత వరుసగా యంగ్ హీరోలతో నటించి తెలుగులో స్టార్ డమ్ పొందేలా కనిపించింది. అయితే ఆమె నటించిన ఎక్కువ సినిమాలు ఫ్లాప్ అయినా గ్లామర్ కి మంచి మార్కులు పడ్డాయి.. చెరుకు రసంతో చేసినట్టుగా ఉన్న ఈ అమ్మడు కి మంచి ఫ్యూచర్ ఉందని భావించారు. మళ్లీ మళ్లీ ఆమె తెరపై కనిపిస్తూనే ఉంటుందిలే అని మనసులకు సర్ది చెప్పుకున్నారు. వాళ్లు ఆశించినట్టుగానే 'పిల్లా నువ్వులేని జీవితం' భారీ విజయాన్ని సాధించింది.

కానీ ఆ తర్వాత ఆమెకు అదృష్టం కలిసి రాలేదు.. ఆమె చేసిన సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.. దాంతో అవకాశాలు దూరమయ్యాయి.తాజాగా స్టార్ హీరోల సరసన ఎందుకు ఆఫర్లు రావడం లేదో తనకు కూడా అర్ధం కావడం లేదని స్పష్టం చేసింది.ఒకప్పుడు ఈ విషయంలో చాలా బాధపడేదాన్ని అని చెప్పిన ఈ భామ.. ఇప్పుడు మాత్రం ఓటీటీ రాకతో తనకు ఆ బాధ లేదని అంటోంది. అంతేకాకుండా.. సినిమాల్లో డిఫరెంట్ రోల్స్ లో కనిపించే ఛాన్స్ లు వస్తుండడంతో.. బడా హీరోల కోసం ఎదురుచూడాల్సిన అవసరం లేదంటోంది. ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్లకు బిగ్ స్టార్స్ తో నటించే అవకాశాలు రావడం లేదని.. అలాంటప్పుడు తననే ఎందుకు ప్రశ్నిస్తున్నారని అడుగుతోంది ఈ బ్యూటీ. రీసెంట్ గా చక్ర సినిమాలో ఆమె నటన అందరిని మెప్పించింది. గతంలో ఎప్పుడు చేయని రోల్ లో మెప్పించింది..








మరింత సమాచారం తెలుసుకోండి: