వెరైటీ యాక్షన్ తో కన్ను కొట్టి కుర్రకారు మదిని గీటిన హీరోయిన్ ప్రియా వారియర్ గుర్తుంది కదా..ఒరు ఆదార్ లవ్ సినిమా లో హీరోయిన్ కాకపోయినా ఆమెకంటే ఎక్కువ గుర్తింపు దక్కించుకుంది ప్రియా.. తన ఒక్క యాక్షన్ తోనే యూత్ లో సెన్సేషన్ అయినా ఆమె ఫుల్ ఫేమస్ అయిపొయింది.ఆమె కన్ను కొట్టిన సీన్లు, బుల్లెట్లు గుండెల్లో దించిన దృశ్యాలు కళ్లముందు కదులుతూ ఉంటాయి. అలాంటి అమ్మడు నవ్వుతుంటే కుర్రాళ్లకు గుండె ఝల్లుమంటుంటుంది.

 ఆ పాపులారిటీ తోనే దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో పేరు దక్కించుకుంటుంది.. తెలుగులో నితిన్ సరసన చెక్ సినిమా చేస్తున్న ప్రియా ఇంకా కొన్ని ప్రాజెక్ట్ లకు సైన్ చేసింది కూడా.. అలాగే మలయాళంలో పెద్ద పెద్ద హీరోల సినిమాలు కూడా చేస్తుంది.. తాజాగా ఈ కేరళ కుట్టి 'చెక్‌' సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఈ సినిమా నేడు రిలీజైంది. ఈ సినిమా ఫలితం సంగతి ఎలా ఉన్నా ఆమెకు మాత్రం మంచి మార్కులే పడ్డాయని తెలుస్తుంది. ఈ సినిమా లో పెర్ఫార్మన్స్ తో మరిన్ని ఛాన్సులు అందుకుంటుంది అంటున్నారు..

 ఇదిలా వుంటే ఆమెకు నితిన్‌తో కన్నా ముందు స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ సినిమాలో నటించే గోల్డెన్‌ ఛాన్స్‌ వచ్చిందన్న వార్తలు వినిపించాయి. పైగా ఈ ఆఫర్‌ను తిరస్కరించినట్లు కూడా గాసిప్స్‌ వచ్చాయి. తాజాగా ఈ రూమర్లపై ప్రియా వారియర్‌ క్లారిటీ ఇచ్చింది."నాకు అల్లు అర్జున్‌ అంటే చాలా ఇష్టం. మలయాళంలో ఆయన సినిమాలు డబ్‌ చేసేవాళ్లు. చిన్నప్పటి నుంచి వాటిని చూస్తూ పెరిగాను. నాకు ఆయన సినిమాలో అవకాశం వచ్చిందని, కానీ నేను దాన్ని చేజేతులా వదిలేసుకున్నట్లు వచ్చిన వార్తలు నాదాకా వచ్చాయి. కానీ అవి వట్టి పుకార్లు మాత్రమే. బన్నీ అంటే నాకు ప్రత్యేక అభిమానం ఉంది. అలాంటిది ఆయనతో కలిసి నటించే అవకాశం వస్తే వదులుకుంటానా! తప్పకుండా నటించి తీరుతాను" అని ప్రియా చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: