ఎయిర్‌డెక్కన్‌ అధినేత జి.ఆర్‌. గోపీనాథ్‌ జీవితం ఆధారంగా సూర్య హీరోగా మోహన్‌బాబు, అపర్ణా బాలమురళీ ప్రధాన పాత్రదారులుగా సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆకాశం నీ హద్దురా’. ఈ చిత్రం తమిళంలో ‘సూరరై పోట్రు’ పేరుతో అమెజాన్ ప్రైమ్ విడుదలైంది. కాటుక కనులే పాట అందరి కాలర్ ట్యూన్ గా,  వాట్సాప్ లలో సందడి చేసింది. అలాగే తెలుగు లో డైరెక్టర్  సుధ కొంగర  వెంకటేష్ గారితో తీసిన గురు సినిమా మంచి విజయం సాధించింది  దానితో ఇటు తెలుగులోను అటు తమిళ్ లోను ఆకాశం నీ హద్దురా సినిమా మీద చాలా అంచనాలతో ఆకాశమే హద్దురా సినిమా విడుదలై మోస్ట్ వ్యూస్ వచ్చిన సినిమా గా అమెజాన్ ప్రైమ్ లో రికార్డ్ సృష్టించింది. కొత్త కొత్త కథలని  ప్రోత్సహించే సూర్య ఈ చిత్రాన్ని నిర్మించడం ఇంకో విశేషం . అయితే ఇప్పుడు ఈ సినిమా ఆస్కార్స్ కి కూడా వెళ్ళింది అనే టాక్ ఇప్పుడు ఇండస్ట్రీ అంత నడుస్తుంది. అయితే ఈ రూమర్స్  అన్నిటికి చెక్ పెడుతూ ఆస్కార్స్ నిజంగానే ఈ సినిమాని ప్రకటించింది. అలాగే ఈ సినిమాలోని నటనకి గాను సూర్య ని బెస్ట్ యాక్టర్ గా కూడా ఆస్కార్స్ లో నామినేట్  అయ్యారు. అలాగే హీరోయిన్ గా చేసిన అపర్ణ బలమురలి కూడా బెస్ట్ హీరోయిన్ గా కూడా ఎంపిక అయింది. అయితే ఈ లిస్ట్ ని ఈరోజు విడుదల చేసారు. ఇక ఈ సినిమా హాలీవుడ్ సినిమాలతో పోటీ పడి గెలుస్తుందా అనేది చూడాలి. ఇక త్వరలోనే ఆస్కార్ అవార్డ్స్ ఈవెంట్ జరగబోతుంది. కరోన వలన అసలు ఈ ఈవెంట్ ఎలా జరుగుతుందో అని అందరూ ఎదురుచూస్తున్నారు. అయితే మొదటి సారి ఆకాశమే హద్దురా సినిమా ఇలా నామినేట్ ఇండియా కి గర్వ కారణం.

మరింత సమాచారం తెలుసుకోండి: