ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన హీరో ఆనంద్ దేవరకొండ.. తన తొలి చిత్రం ‘దొరసాని’ తో పర్వాలేదు అనిపించుకున్నాడు కానీ.. ఆ చిత్రంతో ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయాడు.అంతేకాకా లుక్స్ పరంగా చాలా ట్రోల్ల్స్ అందుకున్నాడు.అయితే ఆ తరువాత వచ్చిన ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ చిత్రంతో మంచి డీసెంట్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. కరోనా కారణంగా గతేడాది ఎండింగ్లో ‘అమెజాన్ ప్రైమ్’ ఓటిటిలో విడుదలైంది ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’. వినోద్ అనంతోజ్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని ‘భవ్య క్రియేషన్స్’ బ్యానర్ పై వి.ఆనంద్ ప్రసాద్ నిర్మించాడు.ఇక ఈ సినిమా హిట్ అవ్వడానికి ప్రధాన కారణం హీరో తండ్రి పాత్రే అని చెప్పాలి.హీరో ఫాథర్ క్యారెక్టర్ ఈ చిత్రానికి మేజర్ ప్లస్ పాయింట్ అయ్యింది...



ఇక ఆ తండ్రి  పాత్రను ప్రముఖ సీరియల్స్ యాక్టర్ గోకరాజు రమణ పూషించాడు.ఇక ఆ పాత్ర పోషించిన గోకరాజు రమణ ఇప్పుడు వరుస ఆఫర్లు అందుకుంటున్నాడు. ఇదిలా ఉండగా.. ఈ చిత్రాన్ని ఈ మధ్యనే జి తెలుగులో టెలికాస్ట్ చేశారు.కాగా మొదటి సారి టెలికాస్ట్ చేసినప్పుడు ఈ చిత్రం 5.71 టి.ఆర్.పి రేటింగ్ ను నమోదు చేసింది. ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్లో విడుదలయ్యి చాలా రోజులు కావస్తున్నప్పటికీ.. అందరి ఫోన్లలో అందుబాటులో ఉన్నప్పటికీ ఈ రేంజ్ టి.ఆర్.పి ని నమోదు చెయ్యడం అంటే మామూలు విషయం కాదనే చెప్పాలి...


ఇక ఈ సినిమాని జి తెలుగు వారు 1.5కోట్లు పెట్టి కొనుగోలు చేశారట. వారు పెట్టింది మొత్తం మొదటిసారి టెలికాస్ట్ చేసినప్పుడే రికవరీ అయినట్టు తెలుస్తుంది. 4.5కోట్లకు ఈ చిత్రం డిజిటల్ రైట్స్ ను కొనుగోలు చేసిన అమెజాన్ ప్రైమ్ వారు కూడా సేఫ్ అయిపోయారట. దాంతో రెండో చిత్రంతో మంచి హిట్ ను సాధించాడు ఆనంద్ దేవరకొండ.ఈ చిత్రంలో పక్కింటి అబ్బాయిల ఆనంద్ చాలా బాగా నటించాడని టాక్ కూడా వచ్చింది. ముఖ్యంగా ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ని బాగా మెప్పించడంతో ఈ సినిమా ఈ స్థాయిలో టీఆర్పీ రేటింగ్ ని సాధించింది... ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో ఆసక్తికరమైన మూవీ అప్ డేట్స్ గురించి తెలుసుకోండి....

మరింత సమాచారం తెలుసుకోండి: