ఒక సినిమా ఒక యాక్టర్ జీవితాన్నే మార్చేస్తుంది. అలాంటి సినిమా యష్ కి కెజిఎఫ్ రూపంలో వచ్చింది. కన్నడలో అంతకుముందు  సినిమాలు చేసి అక్కడ మాత్రమే స్టార్ హీరో గా పేరు తెచ్చుకున్న యష్ ఇప్పుడు దేశమంతట పెద్ద స్టార్ గా మారాడు.  కెజిఎఫ్ సినిమాలో రాకీ భాయ్ గా ఆయన నటనకి దేశం అంత ఫిదా అయిపోయింది.ప్రస్తుతం కన్నడలో భారీ రెమ్యూనరేషన్ పొందుతున్న ఏకైక నటుడు యష్ మాత్రమే.ఇక  ఆయన నటించిన కొన్ని కన్నడ సినిమాలు ఇప్పుడు తెలుగులోకి డబ్బింగ్ అవుతున్నాయి.అలా 2014లో యశ్ నటించిన కన్నడ హిట్ చిత్రం గజకేసరి.. అదే పేరుతో ఇప్పుడు తెలుగులోకి వస్తోంది. శ్రీ వేదాక్షర మూవీస్, కలర్ అండ్ క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రామారావు చింతపల్లి, ఎం.ఎస్. రెడ్డి ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. యస్. కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా మార్చి 5న తెలుగువారిని పలకరించబోతుంది. ఈ ఎపిక్ హిస్టారికల్ యాక్షన్ డ్రామాలో యశ్ రెండు పాత్రల్లో కనిపించటం విశేషం. అమూల్య, అనంత్ నాగ్, సాధుకోకిల, గిరిజా లోకేశ్ నటించిన ఈ చిత్రానికి సంగీతం వి. హరికృష్ణ అందించారు. తాజాగా ఈ చిత్ర టీజర్‌ను కూడా విడుదల చేశారు.ఆయన ప్రస్తుతం నటిస్తున్న కెజిఎఫ్ 2 సినిమా టీజర్ ని ఆయన పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసారు. ఈ టీజర్ కి భారీ ఎత్తున స్పందన వస్తుంది.ఈ టీజర్ లో యష్ లుక్ అదిరిపోయింది. కెజిఎఫ్ మొదటి పార్ట్ తో కొత్త రికార్డులు సృష్టించిన యష్ ఇప్పుడు కెజిఎఫ్ చాప్టర్ 2 తో ఆ రికార్డ్స్ బద్దలు కొడతాడో లేదో వేచి చూడాలి. ఈ సినిమాలో బాలీవుడ్ ప్రముఖ నటుడు సంజయ్ దత్ విలన్ గా నటించడం విశేషం.కెజిఎఫ్ 2  సినిమా  మీద దేశమంతా భారీ అంచనాలు ఉన్నాయ్ .

మరింత సమాచారం తెలుసుకోండి: