తెలుగులో విజయ్ సేతుపతి కి మాములు క్రేజ్ లేదు.ఆయన హీరోగా తెలుగులో ఒక్క డైరెక్ట్ సినిమా కూడా చేయకుండా తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని గెలుచుకున్న హీరో విజయ్ సేతుపతి. తెలుగులోనే కాదు విజయ్ సేతుపతి కి ఇండియా అంత అభిమానులు ఉన్నారు. మొదట షార్ట్ ఫిలిమ్స్ తో తన కెరీర్ మొదలుపెట్టిన విజయ్ మెల్లగా  సినిమాల్లో సైడ్ క్యారెక్టర్స్ చేసుకుంటూ మక్కల్ సెల్వన్ గా తన నటనతో అందరిని అలరిస్తున్నారు. ఇక ఆయన మొదట హీరోగా చేసిన తెమ్మెరుకు పరువకాట్రూ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత తనతో షార్ట్ ఫిలిమ్స్ చేసిన కార్తిక్ సుబ్బరాజ్ మొదటి సినిమా పిజ్జా తో ఆయన సూపర్ హిట్ కొట్టారు. ఈ సినిమాని తెలుగులోకి కూడా డబ్బింగ్ చేశారు. అలా ఇప్పుడు విజయ్ సేతుపతి ఇంకొక సినిమా కూడా డబ్ అవుతుంది. ఓ మంచి రోజు చూసి చెప్తా అనే టైటిల్ లో తమిళంలో సూపర్ హిట్ అయిన సినిమాని తెలుగులోకి దుబ్బింగ్ చేయబోతున్నారు. ఈ సినిమాలో ఇంకొక విశేషం ఏంటి అంటే విజయ్ సేతుపతి తో పాటు కొణిదెల నిహారిక కూడా ఒక ప్రధాన పాత్రలో నటిస్తుంది. ఉప్పెన సినిమాతో విజయ్ సేతుపతి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఆ క్రేజ్ ఈ సినిమాకి ఉపయోగ పడుతుంది అని మూవీ టీం అనుకుంటున్నారు. అందుకే ఈ సినిమాని మార్చి లోనే విడుదల చేస్తున్నారు.ఇక ప్రస్తుతం విజయ్ సేతుపతి హిందీ లో అమీర్ ఖాన్ తో కలిసి లాల్ సింగ్ చద్ద లో నటిస్తున్నారు. అలానే విజయ్ సేతుపతి  బాలీవుడ్ లో హీరోగా ఒక సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రముఖ నటి కత్రినా కైఫ్ నటించబోతుంది. ఇక డైరెక్టర్ గా అందదున్ సినిమా దర్శకుడు శ్రీరామ్సినిమా ని దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే మొదలుకాబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: