అక్కినేని కోడలు సమంత పెళ్లి తర్వాత కూడా తన సత్తా చాటుతుంది. మాములుగా అయితే పెళ్లి తర్వాత హీరోయిన్స్ కు పెద్దగా అవకాశాలు రావు కాని సమంతకు అలా కాదు. పెళ్లి తర్వాత కూడా తన ఫాం ను ఏమాత్రం కోల్పోలేదు. అంతేకాదు వరుస అవకాశాలను చేజిక్కించుకుంటుంది. తెలుగు, తమిళ భాషల్లో తనదైన శైలిలో నటిస్తూ కోట్ల హృదయాలను గెలుచుకున్న సమంత ఈమధ్య డిజిటల్ ఫ్లాట్ ఫాం మీద కూడా తన సత్తా చాటుతుంది.

ఇక లేటెస్ట్ గా గుణశేఖర్ శాకుంతలం సినిమాలో కూడా సమంత నటిస్తుంది. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కించే ఈ సినిమా కోసం గుణశేఖర్ భారీ బడ్జెట్ పెట్టుకున్నాడట. అంతేకాదు అన్నపూర్ణ స్టూడియోస్ లో భారీ సెట్స్ ఏర్పాటు చేశారట. ఈ సినిమాలో సమంత పాత్ర చాలా కొత్తగా ఉంటుందని తెలుస్తుంది. ఆవిఘ్న శాకుంతలం కథతో ఈ సినిమా తెరకెక్కుతుంది. సినిమాలో సమంత నటనకు నేషనల్ అవార్డ్ పక్కా అంటున్నారు. తప్పకుండా సమంత తన నట విశ్వరూపం చూపిస్తుందని అంటున్నారు.

సినిమాలో సమంతతో పాటుగా తెలుగు హీరోయిన్ ఈషా రెబ్బ కూడా నటిస్తుందని తెలుస్తుంది. మళయాళ నటుడు దేవ్ కూడా నటిస్తున్నాడు. సమంతకు ఈ సినిమా ఓ రేంజ్ లో పేరు తెచ్చే సినిమా అవుతుందని అంటున్నారు. రుద్రమదేవి తర్వాత గుణశేఖర్ చేస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై ఇప్పటికే అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక సినిమా నుండి వస్తున్న అప్డేట్స్ ప్రచార చిత్రాలతో సినిమా గురించి మరింత ఆసక్తి పెంచేలా చేస్తున్నాడు గుణశేఖర్. మార్చ్ 16 నుండి శాకుంతలం షూటింగ్ మొదలవుతుందని తెలుస్తుంది.                                              
  

మరింత సమాచారం తెలుసుకోండి: