ఒకప్పుడు 20 సంవత్సరాలు వయసు వచ్చిందంటే తల్లిదండ్రులు వారి పిల్లలకు పెళ్లిళ్లు చేసి వారి బాధ్యతలను నెరవేర్చే వారు. 20 సంవత్సరాలు దాటి పెళ్లి ఆలస్యం అయితే వారిని ముదురు బెండకాయ అంటూ వెటకారంగా మాట్లాడే వారు. కానీ ప్రస్తుతం 30 సంవత్సరాలు నిండిన కూడా పెళ్లి చేసుకోకపోవడం సర్వసాధారణ విషయం. ప్రస్తుతం అబ్బాయిలు అమ్మాయిలు కూడా చదువులు ఉద్యోగాలు అంటూ పెళ్లి చేసుకునే సరికి 30 సంవత్సరాలు నిండుతున్నాయి. అయితే ఈ 30 సంవత్సరాల అనేది సెలబ్రిటీల విషయంలో సర్వసాధారణమే. సాధారణంగా ఇండస్ట్రీ లో పనిచేసే సెలబ్రిటీలు పెళ్లిళ్లు చేసుకుంటే వారి జీవితం అక్కడితో ఆగిపోతుందనే ఉద్దేశంతో 30 సంవత్సరాలు దాటిన పెళ్లిళ్లు చేసుకోవడానికి ఇష్టపడరు.అయితే ప్రస్తుతం బుల్లితెరపై నటించే పలువురు సెలబ్రిటీలు సైతం మూడు పదుల వయసు దాటినా కూడా పెళ్లి చేసుకోకుండా అలాగే ఉన్నారు. ఇంతకీ ఆ సెలబ్రిటీలు ఎవరో ఇక్కడ తెలుసుకుందాం...

1) రష్మి గౌతమ్:
రష్మి గౌతమ్ వయస్సు కరెక్టుగా తెలియకపోయినా గూగుల్ ప్రకారం ప్రస్తుతం వయసు 34 సంవత్సరాలు అని తెలుస్తోంది.34 సంవత్సరాల అయినప్పటికీ పెళ్లి గురించి ఎలాంటి ప్రస్తావన ఎత్తలేదు. బుల్లితెరపై జబర్దస్త్ వంటి కామెడీ షో కి యాంకర్ గా నిర్వహిస్తూ ఎంతో గుర్తింపు సంపాదించుకొని తన బ్యాచిలర్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు.

2) రోహిణి:
బిగ్ బాస్ త్రీ ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్న రోహిణి పలు సీరియల్స్, పలు టీవీ కార్యక్రమాలలో సందడి చేస్తూ అందరినీ ఆకట్టుకున్నారు. రోహిణి వయస్సు ఇప్పటికే 30 సంవత్సరాలు దాటిన పెళ్లి మాటే ఎత్తడం లేదు.తన నటన ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్న రోహిణికి పలు సినిమాలలో అవకాశాలు కూడా వస్తున్నాయి.

3) విష్ణు ప్రియ:
ప్రస్తుతం బుల్లితెర స్టార్ యాంకర్లలో విష్ణు ప్రియ చేరిపోయింది. 33 ఏళ్ల వయసున్న విష్ణు ప్రియ పెళ్లి గురించి ప్రస్తావన లేకుండా ఒంటరి జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు.

4) హైపర్ ఆది:
జబర్దస్త్ కమెడియన్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న హైపర్ ఆది ప్రస్తుతం పలు సినిమాల్లో బిజీగా ఉన్నారు. ఈ ఎనర్జిటిక్ కమెడియన్ వయస్సు 31 సంవత్సరాలు అయినా పెళ్లి ప్రస్తావన తీసుకురాలేదు.

5) సుధీర:
బుల్లితెర ఆర్టిస్టులలో ఒకరైన సుడిగాలి సుధీర్ ఎంతో బిజీగా గడుపుతున్నారు. 33 ఏళ్ల వయసు వచ్చిన పెళ్లి చేసుకోకుండా బ్యాచిలర్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నాడు.

6) ప్రదీప్:
బుల్లితెర మేల్ స్టార్ యాంకర్ గా ప్రదీప్ ముందు వరుసలో ఉంటారు.కేవలం యాంకర్ గా మాత్రమే కాకుండా మరో వైపు హీరోగా సినిమాలను చేస్తూ ఎంతో బిజీగా గడుపుతున్న ప్రదీప్ వయసు 34 సంవత్సరాలు అయినా పెళ్లి చేసుకోకుండా జీవితాన్ని తెగ ఎంజాయ్ చేస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: