బిగ్ బాస్ రియాలిటీ షో ప్రతి ఒక్కరిని కదిలిస్తుంది. మొత్తానికి టీవీ ల ముందల వాలిపోయేలా చేస్తుంది. ఒక మనిషికి అవతలి మనిషి ఎలా ఉంటాడు, ఏం చేస్తుంటాడు అని తెలుసుకోవాలనే కుతూహలం ఉంటుంది. నిజ జీవితంలో వాళ్లు ఉండే విధానమును ప్రతి ఒక్కరు పరిశీలిస్తుంటారు. ఈ విధంగా బిగ్ బాస్ షో కూడా ప్రతి ఒక్క సెలబ్రెటీలను ఎంపిక చేసుకొని వాళ్ళు ఉండే విధానమును ప్రపంచానికి పరిచయం చేస్తారు.


ఈ విధంగా బిగ్ బాస్ షో తెలుగులో నాలుగు సీజన్ల లను పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా  హిందీ, తమిళం, కన్నడం, మలయాళంలో కూడా బిగ్ బాస్ సీజన్ లు ఓ రేంజ్ లో సాగుతున్నాయి. ఇక అందులో పాల్గొన్న కంటెస్టెంట్ లు బిగ్ బాస్ తర్వాత తమదైన శైలితో మంచి గుర్తింపును పొందుతున్నారు. అంతేకాకుండా వెండితెరపై అవకాశాలను పొందుతున్నారు.


ఇదిలా ఉంటే ప్రతి ఒక్క బిగ్ బాస్ షోలో హోస్టింగ్ విధానం ముఖ్యమైనది. ప్రతి ఒక్క సీజన్ లో పోస్టింగ్ చేసే స్టార్ హీరోలు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగు బిగ్ బాస్ షోలో మొదటి రెండు సీజన్ లో నటులు ఎన్టీఆర్, నాని హోస్టింగ్ చేయగా.. 3,4 సీజన్ లో హీరో నాగార్జున హోస్టింగ్ చేశారు. ఇదిలా ఉంటే హిందీలో సల్మాన్ ఖాన్, కన్నడ లో కిచ్చ సుదీప్, తమిళంలో కమల్ హాసన్, మలయాళంలో మోహన్ లాల్ పోస్టింగ్ చేస్తున్నారు. ఈ విధంగా ప్రతి సీజన్ లో కంటెస్టెంట్ లకు, హోస్టింగ్ స్టార్ లకు పారితోషికం విషయంలో ఎక్కువగానే ఉంటుంది. అంతేకాకుండా హోస్ట్ గా చేసేందుకు ముందుగా నటులు నిర్ణయం తీసుకొనే పాల్గొంటారట. ఈ విధంగా మలయాళ బిగ్ బాస్ హోస్ట్ గా చేసే మోహన్ లాల్ కు ఇచ్చే పారితోషకం రూ.12 కోట్లు ఉండేదట. కానీ త్వరలోనే మరో సీజన్ ను ప్రసారం కావడానికి సిద్ధంగా ఉండగా.. ఈ సీజన్ లో ఏకంగా రూ.18 కోట్లు తీసుకుంటున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఒక ఎపిసోడ్ కా లేక సీజన్ మొత్తానికా మాత్రం తెలియరాలేదు. ఇక ఫిబ్రవరి 14 నుంచి సీజన్ 3 ప్రసారం కానుంది. ఇందులో కూడా టీవీ సెలబ్రిటీలకే అవకాశం ఉందని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: